కాంగ్రెస్‌లో చేరిన ఎన్సీపీ మాజీ నేత తారిఖ్ అన్వర్

ఎన్సీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ పార్టీ సీనియర్ నేత తారిఖ్ అన్వర్.

news18-telugu
Updated: October 27, 2018, 2:10 PM IST
కాంగ్రెస్‌లో చేరిన ఎన్సీపీ మాజీ నేత తారిఖ్ అన్వర్
కాంగ్రెస్ పార్టీలో చేరిన తారిఖ్ అన్వర్
  • Share this:
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత తారిఖ్ అన్వర్ కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. రఫెల్ డీల్‌లో ప్రధాని నరేంద్ర మోదీని శరద్ పవార్ వెనకేసుకురావడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ నెల క్రితం ఆయన ఎన్సీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తారిఖ్ అన్వర్‌తో పాటు ఆయన అనుచరులకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఎన్సీపీ వ్యవస్థాపక సభ్యల్లో ఒకరు తారిఖ్ అన్వర్. 1999లో శరద్ పవార్‌తో కలిసి తారిఖ్ అన్వర్ ఎన్సీపీని పెట్టారు.   2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తారిఖ్ అన్వర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, మహారాష్ట్రలో ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.

tariq anwar, తారిఖ్ అన్వర్, కాంగ్రెస్, ఎన్సీపీ
కాంగ్రెస్ పార్టీలో చేరిన తారిఖ్ అన్వర్


తారిఖ్ అన్వర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించిన ఎన్సీపీ చీఫ్ అధికారప్రతినిధి నవాబ్ మాలిక్...చాలా రోజులుగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న యోచనలో ఉన్నట్లు తెలిపారు. అయితే ఎన్సీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన చెప్పిన కారణం తమను ఆవేదనకు గురిచేస్తున్నట్లు చెప్పారు.

Published by: Janardhan V
First published: October 27, 2018, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading