నాపై హత్య యత్నానికి కుట్ర జరిగింది : మాజీ ఎంపీ సంచలనం

Former MP Harsha Kumar Sensational Allegations : తనపై హత్యాయత్నానికి సంబంధించి డీజీపికి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని.. అందుకే ఎన్నికల ప్రధాన అధికారిని కలిసినట్టు చెప్పారు. పదవిలో లేకపోయినా ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను టీడీపీ అనేక ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు.

news18-telugu
Updated: April 17, 2019, 3:01 PM IST
నాపై హత్య యత్నానికి కుట్ర జరిగింది :  మాజీ ఎంపీ సంచలనం
మాజీ ఎంపీ హర్ష కుమార్(File)
news18-telugu
Updated: April 17, 2019, 3:01 PM IST
మాజీ ఎంపీ హర్షకుమార్ బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. తన కారు వీల్స్ బోల్టును తొలగించి తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిందిగా ద్వివేదిని కోరినట్టు తెలిపారు.

తనపై హత్యాయత్నానికి సంబంధించి డీజీపికి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని.. అందుకే ఎన్నికల ప్రధాన అధికారిని కలిసినట్టు చెప్పారు. పదవిలో లేకపోయినా ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనను టీడీపీ అనేక ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. సామాజిక న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఇటీవల టీడీపీలో చేరానని.. కానీ తనకు అమలాపురం టికెట్ ఇస్తానని మొండి చెయ్యి చూపడంతో పార్టీని వీడానని చెప్పారు.

ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఫీజులపై తాను న్యాయం పోరాటం చేస్తున్నానని, కాలేజీల్లో అడ్డగోలు దోపిడీ చేస్తున్నారని హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ ఫీజులపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు రూ.2800 మాత్రమే అని, కానీ ప్రోత్సహకం పేరుతో రూ.35వేలు కొంతమందికే చెల్లించడమేంటని ప్రశ్నించారు. ఫీజుల నియంత్రణపై పోరాటంలో కచ్చితంగా తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు.

First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...