FORMER MLA CHINTALAPUDI VENKATARAMAIAH QUITS JANASENA PARTY MS
జనసేనకు వరుస షాక్‌లు.. పార్టీని వీడిన మరో కీలక నేత
పవన్ కల్యాణ్
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరుపున వెంకట్రామయ్య పెందుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జనసేనలోనే కొనసాగితే రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమే అన్న నిర్ణయానికి వచ్చిన చింతలపూడి పార్టీ వీడటానికే నిర్ణయించుకున్నారు.
జనసేనకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వరుసపెట్టి నేతలు పార్టీని వీడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే,సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేసిన మరుసటిరోజే మరో నేత పార్టీని వీడారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడివెంకట్రామయ్య పార్టీకి రాజీనామా చేశారు.ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. గాజువాక ప్రజలు,కార్యకర్తల కోరిక మేరకే పార్టీ వీడుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా పవన్ అంటే అభిమానం ఉన్నప్పటికీ.. రాజకీయంగా జనసేనతో కలిసి నడవలేనని స్పష్టం చేశారు. ఇంతవరకూ తనపై చూపిన అదరాభిమానాలకు కృతజ్ఞుడినని చెప్పారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరుపున వెంకట్రామయ్య పెందుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జనసేనలోనే కొనసాగితే రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమే అన్న నిర్ణయానికి వచ్చిన చింతలపూడి పార్టీ వీడటానికే నిర్ణయించుకున్నారు. దీంతో రావెల కిశోర్ బాబుతో మొదలైన రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు, ఆకుల సత్యనారాయణ ఇప్పటికే పార్టీని వీడారు.ఇప్పుడిదే బాటలో వెంకట్రామయ్య కూడా చేరారు. ఓవైపు పార్టీ నుంచి వరుసపెట్టి నేతలు వెళ్లిపోతున్నా..వారిని ఆపే ప్రయత్నం మాత్రం జరగకపోవడం గమనార్హం.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.