Home /News /politics /

FORMER MINISTER YANAMALA RAMAKRISHNUDU TAKES ON YS JAGAN OVER PALNADU ISSUE MS

రాష్ట్రంలో ఫాసిస్ట్ పాలన.. హిట్లర్,ముసోలినిలను జగన్ మించిపోయాడు.. : యనమల

వైఎస్ జగన్, యనమల రామకృష్ణుడు..(ఫైల్ ఫోటోలు)

వైఎస్ జగన్, యనమల రామకృష్ణుడు..(ఫైల్ ఫోటోలు)

అసలు రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమా? లేక ఫాసిస్ట్ పాలనా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ నిరంకుశ పాలనను ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.

    ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.హిట్లర్,ముసోలిని వంటి నియంతలను సైతం జగన్ మించిపోయారని విమర్శించారు. వాళ్ల చరిత్ర ఎలాగైతే ముగిసిందో..జగన్ పాలన కూడా అలాగే అంతమవుతుందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయని.. ఇంత దారుణమైన,క్రూరమైన పాలనను ఎప్పుడూ చూడలేదని అన్నారు.

    అసలు రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమా? లేక ఫాసిస్ట్ పాలనా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ నిరంకుశ పాలనను ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు కూడా ప్రభుత్వ పక్షాన వ్యవహరిస్తూ బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పల్నాడు బాధితులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం ఆపేది లేదని తెగేసి చెప్పారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Andhra Pradesh, Palnadu, Yanamala Rama Krishnudu, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు