FORMER MINISTER AND BJP MLA RAJENDER SETIRES ON KCR MUMBAI VISIT AND HE SAID AN ALLIANCE OF REGIONAL PARTIES WOULD NOT STAND WITHOUT A NATIONAL PARTY PRV
Telangana: సీఎం కేసీఆర్ ముంబై పర్యటనపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సెటైర్లు.. ప్రాంతీయ పార్టీల కూటమిపై ఏమన్నారంటే..
ఈటల రాజేందర్, కేసీఆర్ (ఫైల్)
ఇవాళ కేసీఆర్ ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి వెళ్లారు. అయితే కేసీఆర్ ముంబై పర్యటనపై (KCR Mumbai visit) మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు.
బీజేపీ (BJP) వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయేతర పార్టీలతో కేసీఆర్ 2018 నుంచి సంప్రదింపులు సాగిస్తున్నారు. అయితే గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఆశించినంతగా ప్రయోజనాన్ని ఇవ్వలేదు. దీంతో మరోసారి కేసీఆర్ బీజేపీయేతర పార్టీలను కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. గత వారంలో ఉద్దవ్ ఠాక్రే (Uddav tackarey) కేసీఆర్ ను ముంబైకి రావాలని ఆహ్వానించారు. ఇవాళ కేసీఆర్ ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి వెళ్లారు. జాతీయ రాజకీయ అంశాలపై పవార్తోనూ కేసీఆర్ చర్చించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్కు తిరిగిరానున్నారు. అయితే కేసీఆర్ ముంబై పర్యటనపై (KCR Mumbai visit) మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు.
ప్రజాగ్రహం డైవర్ట్ చేయడానికే..
జాతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి (alliance of regional parties) సాధ్యం కాదని ఈటల రాజేందర్ (Eetala Rajender) అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసలని నమ్మే పరిస్థితి లేదని, ప్రతిపక్ష పార్టీలను సీఎం కేసీఆర్ ఏనాడు పరిగణలోకి తీసుకోలేదని రాజేందర్ విమర్శించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాలు పెంచారని, సిబ్బందిని మాత్రం ఆ స్థాయిలో పెంచలేదన్నారు. తెలంగాణ (Telangana) ప్రజా ఆగ్రహం డైవర్ట్ చేయడానికే కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల కూటమి ముందట పడదని ఈటల రాజేందర్ (Eetala Rajender) అన్నారు. మేడారం జాతరకు గవర్నర్ వెళ్తే.. కనీసం రిసీవ్ చేసుకోలేదని, ఇది తెలంగాణ ప్రభుత్వ సంస్కారమని ఎద్దేవా చేశారు.
ఖాళీగా లక్షకు పైగా ఉద్యోగాలు ..
ఉద్యోగ నియామకాలపై తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణలో 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. నోటిఫికేషన్లు లేక ఉద్యోగాలు లేక పెళ్లిళ్లు కాకపోవడంతో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈటల రాజేందర్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో 1,32,299 ఉద్యోగాలు ఇచ్చినట్లు కేటీఆర్ ప్రకటించారని, టీఎస్పీఎస్సీ ద్వారా 31 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
ఒక్క గ్రూప్ 1 పరీక్ష కూడా లేదు..
టీఎస్ఆర్టీసీలో 4768 మందిని రిక్రూట్ చేశామని చెప్పారని, ఒక్క డ్రైవర్, కండక్టర్ని కూడా ఫిలప్ చేయలేదన్నారు ఈటల. ఒక్క గ్రూప్ వన్ పరీక్ష కూడా తెలంగాణ (Telangana) ప్రభుత్వం నిర్వహించలేదని ఈటల రాజేందర్ (Eetala Rajender) ధ్వజమెత్తారు. గెస్ట్ ఫ్యాకల్టీ పేరుతో గురుకులాల్లో బోధన చేయిస్తున్నారని, శ్రమ దోపిడీ ప్రభుత్వమే చేస్తోందని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.