Meira Kumar: మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌‌ ఫేస్ బుక్ పేజీ బ్లాక్

లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌కు ఫేస్ బుక్ షాక్ ఇచ్చింది. ఆమె ఫేస్ బుక్ ఖాతాను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

news18-telugu
Updated: October 15, 2020, 5:53 PM IST
Meira Kumar: మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌‌ ఫేస్ బుక్ పేజీ బ్లాక్
మీరా కుమార్ (File)
  • Share this:
లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌కు ఫేస్ బుక్ షాక్ ఇచ్చింది. ఆమె ఫేస్ బుక్ ఖాతాను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ‘ఫేస్ బుక్ పేజ్ బ్లాక్ అయింది. ప్రతిపక్షం గళాన్ని నొక్కేస్తున్నారు. ప్రజాస్వామ్యంపై దాడి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు. ఫేస్ బుక్ నా పేజీని బ్లాక్ చేసింది.’ అంటూ వెల్లడించారు. బీజేపీకి అనుకూలంగా ఫేస్ బుక్ సంస్థ వ్యవహరిస్తుందని... రాజకీ, ఆర్థిక ప్రయోజనాల కోసం సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. దీని మీద ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ కూడా ఫేస్‌బుక్‌ను ప్రశ్నించింది. 'పౌరుల హక్కుల పరిరక్షణ, సోషల్, ఆన్ లైన్ న్యూస్ మీడియా ప్లాట్‌ఫాఫ్ దుర్వినియోగాన్ని నిరోధించడం'' అనే అంశంపై థరూర్ కమిటీ ఫేస్ బుక్ ను ప్రశ్నలు అడిగింది. ఫేస్ బుక్ సంస్థకు ఏ దేశంలోనూ ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాల్లేవని, పక్షపాతంగా వ్యవహరించబోమని గతంలోనే ప్రకటించింది ఫేస్ బుక్.

ఇటీవల ఫేస్ బుక్‌ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొందరు రాజకీయ నేతల అకౌంట్లను కూడా బ్లాక్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మీరాకుమార్ ఫేస్ బుక్ అకౌంట్‌ను కూడా బ్లాక్ చేసింది. భారత్ లో ఫేస్ బుక్ సంస్థ 2011 నుంచి బీజేపీకి అనుకూలంగా, ప్రజల్ని ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నదని ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జనరల్ ఇటీవల వరుస కథనాలను ప్రచురించడం తెలిసిందే.

మీరాకుమార్ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2009 నుంచి 2014 మధ్య 15వ లోక్‌సభ స్పీకర్‌గా విధులు నిర్వర్తించారు. బీహార్‌కు చెందిన ఆమె ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2017లో యూపీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. రామ్ నాథ్ కోవింద్ మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. బీహార్‌తో పాటు 16 రాష్ట్రాల్లోని 56 నియోజకవర్గాల ఉపఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేశారు. మూడు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. తొలి దశలో 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాలు, రెండో దశలో 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాలు, మూడో దశలో 15 జిల్లాల్లో 78 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబరు 28న తొలి దశ, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నవంబరు 10న ఫలితాలను ప్రకటిస్తారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 15, 2020, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading