Home /News /politics /

FORMER INDIAN CRICKETER BIHAR CONGRESS LEADER KIRTI AZAD JOINS TMC IN PRESENCE OF MAMATA BANERJEE PRV

Bihar: టీఎంసీలో చేరిన భారత మాజీ క్రికెట్​ ఆటగాడు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మమతా బెనర్జీ

కీర్థీ ఆజాద్​కు పార్టీ కండువా కప్పుతున్న మమతా బెనర్జీ (photo:ANI/Twitter)

కీర్థీ ఆజాద్​కు పార్టీ కండువా కప్పుతున్న మమతా బెనర్జీ (photo:ANI/Twitter)

భారత టెన్నిస్​ ప్లేయర్ (Tennis player)​ లియాండర్​ పేస్ ​ఇటీవల టీఎంసీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ భారత మాజీ క్రికెట్​ ఆటగాడు (Indian former cricketer) సైతం టీఎంసీలోకి వెళుతున్నారు

రాజకీయ పరిణామాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి.  ఏ రాష్ట్రంలోనైనా అక్కడి అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలు ఆయా నాయకులను చేర్చుకునే పనిలో ఉన్నాయి.  లేదా ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీ నాయకులను లాగేసుకుంటుంది. అయితే తృణమూల్​ పార్టీ  (TMC)ఎంట్రీతో చాలా రాష్ట్రాల్లో రాజకీయ ముఖ చిత్రాలు మారిపోతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రస్థాయి పార్టీగా ఉన్న మమతా బెనర్జీ  (Mamatha Banerjee) నేతృత్వంలోని టీఎంసీ ఇపుడు జాతీయ పార్టీగా మారుతోంది. ఇదే క్రమంలో ఆయా రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేస్తున్నారు బెంగాల్​ సీఎం, పార్టీ చీఫ్​ మమతా బెనర్జీ. ఇటీవల గోవాలోనూ ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడి ప్రచారంలో భాగంగా భారత టెన్నిస్​ ప్లేయర్ (Tennis player)​ లియాండర్​ పేస్ ​ సైతం టీఎంసీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ భారత మాజీ క్రికెట్​ ఆటగాడు (Indian former cricketer) సైతం టీఎంసీలోకి వెళుతున్నారు. ఆయనే కీర్తీ ఆజాద్ (Kirti Azad).​

బిహార్ కాంగ్రెస్ పార్టీ నేత (Bihar congress party leader), మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్‌ (TMC)లో చేరారు. ఈ రోజు సాయంత్రం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో కీర్తి ఆజాద్ (kirti azad) టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. కీర్తి ఆజాద్ చేరికతో టీఎంసీ పార్టీ మొట్టమొదటిసారిగా బిహార్‌ (Bihar)లో అడుగుపెట్టనుంది. 2024 ఎన్నికల కోసం మమతా పార్టీ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టీఎంసీని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. 1983 క్రికెట్ వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్ బీహార్ రాష్ట్రంలోని దర్బంగా స్థానం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు.



కీర్తి ఆజాద్.. బీహార్ మాజీ ముఖ్యమంతి భగత్ ఝా ఆజాద్ కుమారుడు. గతంలో హర్యానాలోని సిర్సా లోక్‌సభ నుంచి గెలిచిన అశోక్ తన్వర్ 2019లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాల ముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత దుష్యంత్ చౌతాలా జేజేపీ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.

Photo (Ani/Twitter)


కీర్తి ఆజాద్.. 2019 లోక్ సభ ఎన్నికల్లో ధన్‌బాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకుముందు బీజేపీ (BJP)లో పనిచేసిన కీర్తి ఆజాద్ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారంటూ బహిరంగంగా ఆరోపించారు. దీంతో బీజేపీ అతన్ని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కీర్తి ఆజాద్ కాంగ్రెస్ గూటికి చేరారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Bihar, TMC

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు