నిన్నమొన్నటి వరకు ఏపీలో కీలకంగా వ్యవహారించిన ఆ ఐఏఎస్ అధికారి ఇప్పుడు రాజకీయ నేత అవతారం ఎత్తబోతున్నాడు. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కీలకంగా వ్యవహారించిన ఈ ఐఏఎస్ అధికారి తరువాత కాలంలో తనకు సీఎంఓలో సరైన ప్రాదాన్యత దక్కడం లేదని బయటకు వచ్చేశారు. ఆయనే మాజీ ఐఎస్ అధికారి పీవీ రమేష్. అప్పటి నుంచి సైలెంట్ గా ఉంటూ వచ్చిన ఆయన గత కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ప్రరోక్షంగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తోన్నారు. అయితే ఒక్కసారిగా ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి బలమైన కారణం ఉందంటున్నారు ఆయన సన్నిహితలు. బీజేపీ నుంచి పార్టీకి రావాలని ఆహ్వనం అందడం వలనే ఆయన ఇప్పుడు ఇలాంటి వ్యాఖలు చేస్తోన్నారని టాక్ వినిపిస్తోంది.
అన్ని అనుకూలిస్తే త్వరలో ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీలో బీజేపీకి నేతల కొరత విపరితంగా ఉంది. ఎమ్మెల్యే అభ్యర్ధలు ఎలాగోలా దొరుకుతున్న పార్టీకి ఎంపీ అభ్యర్ధలు మాత్రం దొరకడం తలకుమించిన భారమవుతుందనే వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే మాజీ ఐఎఎస్ అధికారులపై పార్టీ లో కీలక నేతలు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహాంతోనే ఇప్పటికే మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులును పార్టీకి ఎప్పుడో తీసుకున్నారు. త్వరలో జరగబోయే తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఆయన్నే బరిలో దింపే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు ఒక ప్రచారం కూడా బీజేపీలో జోరుగా జరుగుతంది.
ఈయనతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరు కూడా విఫరీతంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన పీవీ రమేష్ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం వెనుక బీజేపీ వ్యూహామా అనేదానిపై జగన్ అండ్ కోం ఆరా తీస్తోన్నారు. తాజాగా 'నేరమే అధికారం అయితే..అది ప్రజలను వెంటాడుతుంది. ఊరక కూర్చున్ననోరున్న వాడూ నేరస్థుడే' అంటూ వరవరరావు చేసిన ట్వీట్ ను ఆయన రీట్వీట్ చేశారు. ఇది పెద్ద చర్చకే దారి తీసింది. తరువాత ఆయన సర్ధి చెప్పకునే ప్రయత్నం చేసిన ఆయన కావాలనే ఈ ట్వీట్ చేశారనేది ఆయన సన్నిహితలు చెబుతున్న మాట.
ఇక పీవీ రమేష్ విషయానికొస్తే జగన్ ప్రభుత్వంలో కొద్ది రోజులు ఆయన కీలక సలహాదారుడుగా వ్యవహారించారు తరువాత ఆయనకు ముఖ్యమంత్రి మధ్య వచ్చి గ్యాప్ కారణంగా ఆయన దగ్గర నుంచి కొన్ని బాధ్యతలను తొలగించడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి బయటకొచ్చేశారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల కోసం ఏపీ బీజేపీ శ్రేణులు ఇప్పటి నుంచే బలమైన ఎంపీ అభ్యర్ధలను సమకూర్చుకుంటుంది. పీవీ రమేష్ లాంటి అనుభవం ఉన్న ఒక మాజీ ఐఏఎస్ అధికారి పార్టీకి వస్తే ఆ అనుభవం తమ పార్టీకి బాగా కలిసొస్తుందనే ఆలోచనలో రాష్ట్ర బిజేపీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.