అరుణ్ జైట్లీ పరిస్థితి అత్యంత విషమం... ఎయిమ్స్‌కు రాష్ట్రపతి

9వ తేదీ నుంచి ఆయన్ను ఐసీయూలోనే ఉంచిన డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషమించిందన్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మరికాసేపట్లో ఎయిమ్స్ కు చేరుకోనున్నారు.

news18-telugu
Updated: August 16, 2019, 10:45 AM IST
అరుణ్ జైట్లీ పరిస్థితి అత్యంత విషమం... ఎయిమ్స్‌కు రాష్ట్రపతి
అరుణ్ జైట్లీ
  • Share this:
మాజీ ఆర్థికమంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో ఆయన ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత వారంలో ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స నిమిత్తం చేర్పించిన సంగతి తెలిసిందే. 9వ తేదీ నుంచి ఆయన్ను ఐసీయూలోనే ఉంచిన డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషమించిందన్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మరికాసేపట్లో ఎయిమ్స్ కు చేరుకోనున్నారు. జైట్లీని పరామర్శించే కోవింద్,  డాక్టర్లను అడిగి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

66 ఏళ్ల అరుణ్ జైట్లీ  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే ఆయన 2019సార్వత్రిక ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నారు. మంత్రివర్గంలోకూడా చేరలేదు. గతంలో ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తించారు. గతంలో కేంద్ర ఆర్థిక శాఖమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>