Home /News /politics /

FOR WEDDING GIFT JUST VOTE FOR AAP HARYANA COUPLE INVITATION SB

మీ ఓటు ఆమ్ ఆద్మీ పార్టీకే... వైరల్ అవుతున్న శుభలేఖ

ఆప్‌కు ఓటేయాలంటూ పెళ్లి కార్డుపై ప్రచారం

ఆప్‌కు ఓటేయాలంటూ పెళ్లి కార్డుపై ప్రచారం

పెళ్లి శుభలేఖలపై ‘రానున్న లోక్‌సభ, విధానసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేయండి. మీరు మా పెళ్లికి ఇచ్చే కానుక అదే’ అని ముద్రించారు.

    ఈ మధ్య పెళ్లిళ్లు ట్రెండ్ మారుతున్నాయి. మా పెళ్లికి వస్తే ఏం తెస్తారు...మీ పెళ్లికి ఏం ఇమ్మంటారు అన్న రోజులు పోయాయి. ఇప్పుడు వివాహ వేడుకలు కూడా పొలిటికల్‌గా హీటెక్కిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో... కొత్తగా ఒక్కటవుతున్న జంటలకు కూడా ఎన్నికల ఫీవర్ పట్టుకున్నట్లైంది. దీంతో కొత్తగా పెళ్లి చేసుకుంటున్న ఓ జంట ఆమ్ ఆద్మీ పార్టీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంది. తమ పెళ్లి శుభలేఖలపై ఆప్‌కు ఓటేయాలంటూ ప్రింట్ చేసింది. అందరికీ శుభలేఖలు పంపింది. తమ పెళ్లి శుభలేఖలపై ఏకంగా ఆ పార్టీకే ఓటేయాలని ముద్రించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్ ‘ఆప్’కు ఓటేయడమే మీరు మాకిచ్చే అతిపెద్ద బహుమానమని పేర్కొంది.

    ఇవికూడా చదవండి:

    పెళ్లి రోజే తాగొచ్చాడు.. వధువు ఇచ్చిన షాక్‌తో దిమ్మ తిరిగింది..

    హరియాణాకు చెందిన జస్విందర్ సింగ్-ఇంద్రజిత్ కౌర్‌లు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. వీరు తమ పెళ్లి శుభలేఖలపై ‘రానున్న లోక్‌సభ, విధానసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేయండి. మీరు మా పెళ్లికి ఇచ్చే కానుక అదే’ అని ముద్రించారు. ఈ కార్డును ఆఫ్ సోషల్ మీడియా వ్యూహకర్త అంకిత్ లాల్ ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

    కాగా, ఆప్ అధికార ప్రతినిధి కుల్దీప్ కడ్యాన్ కూడా ఇటువంటిదే మరో ఆహ్వాన పత్రికను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ శుభలేఖలో సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు గోపాల్ రాయ్, నవీన్ జైహింద్ చిత్రాలను ముద్రించారు. ఈ శుభలేఖను పోస్టు చేసిన ఆయన హరియాణాలోని చాలాచోట్ల ఇటువంటి పరిస్థితే ఉందని పేర్కొన్నారు. మొత్తం మీద పెళ్లి కార్డులతో యూత్ ఫాలో అవుతున్న ఈ కొత్త ట్రెండ్ అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది.



    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: AAP, Arvind Kejriwal, Haryana, National News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు