Madhya Pradesh: కమల్ నాథ్ సర్కార్ నిలిచేనా ? కమలం గెలిచేనా ?

Madhya Pradesh Floor Test | 22 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీపై తిరుగుబాటు చేయడంతో... ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అష్టకష్టాలు పడుతోంది.

news18-telugu
Updated: March 20, 2020, 10:55 AM IST
Madhya Pradesh: కమల్ నాథ్ సర్కార్ నిలిచేనా ? కమలం గెలిచేనా ?
కమల్‌నాథ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
మధ్యప్రదేశ్‌లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంకటంలో పడిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేడు రాష్ట్రంలోని కమల్ నాథ్ సర్కార్ బలపరీక్ష ఎదుర్కోనుంది. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సహకారంతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా ఉండగా... ఏదో ఒకటి జరిగి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఆశతో ఉన్నాయి. సాయంత్రం ఐదు గంటలలోపు బలపరీక్ష పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో... రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ భవితవ్యం ఏమిటన్నది సాయంత్రం తేలిపోనుంది. రెండు గంటలకు సభను ప్రారంభించి... 5 గంటలకు బలపరీక్ష లాంఛనాన్ని పూర్తి చేయాలని అసెంబ్లీ అధికారులు నిర్ణయించారు.

మొత్తం 230 సభ్యులు ఉండే మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రస్తుతం 228 మంది సభ్యులు ఉన్నారు. 16 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 108గా ఉన్న కాంగ్రెస్ బలం 92కు పడిపోయింది. అంతకుముందు ఆరుగురు మంత్రులు రాజీనామా చేశారు. బీజేపీకి సభలో 107 మంది బలం ఉంది. ఈ తరుణంలో జరగబోయే బలపరీక్షలో కమల్ నాథ్ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు బీస్పీ, ఎస్పీ సభ్యులు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు.

22 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీపై తిరుగుబాటు చేయడంతో... ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అష్టకష్టాలు పడుతోంది. బెంగళూరులో క్యాంప్‌లో ఉన్న తమ ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. వారు బస చేస్తున్న రిసార్ట్ వద్ద హైడ్రామా నడిచింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, మరికొందరు నేతలు రమడ రిసార్ట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త నెలకొంది.
Published by: Kishore Akkaladevi
First published: March 20, 2020, 10:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading