చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు.. మునిగిన రివర్ వ్యూ భవనం

ప్రకాశం బ్యారేజి నుంచి భారీగా వదర నీరు విడుదల చేయటంతో విజయవాడ నగరంతో పాటుగా రాజధాని ప్రాంతంలోని కరకట్ట దిగువ నదీ భగర్భంలో నది వేగంగా ప్రవహిస్తోంది.

news18-telugu
Updated: August 16, 2019, 9:44 AM IST
చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు.. మునిగిన రివర్ వ్యూ భవనం
చంద్రబాబు, లింగమనేని గెస్ట్ హౌస్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కరకట్ట నివాసం లోపలకు వరద నీరు చేరింది. రెండు రోజుల క్రితం వరద నీరు నివాసంలోకి వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలుగా రక్షణ ఏర్పాట్లు తీసుకున్నారు. అయితే. చంద్రబాబు నివాసానికి ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్పిన..48 గంటల్లోనే తిరిగి వరద నీరు పోటెత్తింది. దీంతో... చంద్రబాబు నివాసంలోని వాక్ వే పూర్తిగా మునిగిపోయింది. అదే సమయంలో రివర్ వ్యూ భవనం సగానికి పైనా నీరు చేరింది. దీంతో..సిబ్బంది అక్కడ స్టోన్ క్రషర్ డస్ట్...ఇసుకతో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అన్ని గేట్లు ఎత్తివేసిన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసారు. ప్రకాశం బ్యారేజి నుండి నీరు విడుదల చేయటంతో విజయవాడ నగరం తో పాటుగా రాజధాని ప్రాంతంలోని కరకట్ట దిగువ నదీ భగర్భంలో నది వేగంగా ప్రవహిస్తోంది. దీంతో..కరకట్ట వద్ద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న నివాసంలోకి వరద నీరు చేరుతోంది.

ప్రస్తుతం చంద్రబాబు ఆయన కుటుంబంతో సహా హైదరాబాద్‌లోనే ఉన్నారు. కరకట్టపై ఉన్న నివాసంలో పనివారు మాత్రం వరద నీరు లోపలకు రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వరదనీరు తగ్గకపోవడంతో ఈ రోజు తాడేపల్లి రావాల్సిన చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండాలని నిర్ణయించారు.  ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చంద్రబాబు ఇంటిని పరిశీలించారు. కరకట్టపై వరద నీరు ఉధృతిపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: August 16, 2019, 9:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading