చంద్రబాబు నివాసానికి పొంచి ఉన్న ముప్పు

చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్‌హౌస్ మెట్ల వరకు వరద నీరు చేరుకోవడంతో ఆందోళన మొదలైంది.

news18-telugu
Updated: August 14, 2019, 8:58 AM IST
చంద్రబాబు నివాసానికి పొంచి ఉన్న ముప్పు
ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం
  • Share this:


ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వరద ముప్పు  పొంచి ఉంది. కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం వద్దకు భారీగా వరద నీరు చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న బారీ వరద ప్రవాహంతో కృష్ణా కరకట్ట ప్రమాదంలో పడింది. దీనిని ఆనుకుని నిర్మించిన అనేక నిర్మాణాల్లోకి ఇప్పటికే వరద నీరు చేరింది. చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్‌హౌస్ మెట్ల వరకు వరద నీరు చేరుకోవడంతో ఆందోళన మొదలైంది. దీంతోచంద్రబాబు నివాసంలోకి కూడా వరద నీరు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు కరకట్టపై ఉన్న లింగమేని గెస్ట హౌస్‌లో లేరు.  చేయినొప్పితో ఆయన మంగళవారమే హైదరాబాద్‌కు చేరుకున్నారు.

పులిచింతల నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని వదిలితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండడంతో 5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఫలితంగా కృష్ణా కరకట్ట ప్రమాదంలో పడింది.


First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com