• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • FLASHBACK 2020 POLITICAL LEADERS WHO DIED IN 2020 SU GH

Political Leaders died in 2020: ఈ ఏడాది మరణించిన రాజకీయ నాయకులు వీరే

Political Leaders died in 2020: ఈ ఏడాది మరణించిన రాజకీయ నాయకులు వీరే

ఈ ఏడాది మరణించిన రాజకీయ నాయకులు

2020.. గతంలో ఈ సంవత్సరాన్ని ఎంతో గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఈ ఏడాది పరిస్థితి మారింది. కరోనా(Corona) మహమ్మారి వచ్చి అందరి ఆశలపై నీళ్లు చల్లింది.

  • Share this:
2020.. గతంలో ఈ సంవత్సరాన్ని ఎంతో గొప్పగా చెప్పుకున్నాం. విజన్ 2020 అని భవిష్యత్తు మారుతుందని, నూతన మార్పులకు బాటలు వేస్తుందని సర్వత్రా మాట్లాడుకున్నారు. కానీ ఈ ఏడాది పరిస్థితి మారింది. కరోనా(Corona) మహమ్మారి వచ్చి అందరి ఆశలపై నీళ్లు చల్లింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను తీయడమే కాకుండా దేశాల వ్యాపార వాణిజ్యాలను తీవ్ర సంక్షోభానికి గురిచేసింది. అంతేకాకుండా భారత్ లోనూ కరోనా(Corona) ఈ ఏడాది తీవ్ర ప్రభావానికి గురిచేసింది. రాజకీయ నాయకులు ఇందుకు మినహాయింపు కాదు. కారణాలు ఏవైనా చాలా మంది నాయకులు ఈ సంవత్సరం మరణించారు. ఈ నేపథ్యంలో భారత రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించి ఈ ఏడాది అమరులైన కొంత మంది నాయకులెవరో ఇప్పుడు చూద్దాం.

తరుణ్ గోగోయ్..(Tarun Gogoi)
అసోం మాజీ ముఖ్యమంత్రి అయిన తరుణ్ గోగోయ్ కరోనా వైరస్ వల్ల మత్యవాత పడ్డారు. కోవిడ్-19తో(Covid-19) ఆసుపత్రిలో చేరిన ఆయన మహమ్మారి నుంచి బయటపడినప్పటికీ.. అనంతరం వచ్చిన వ్యాధి లక్షణాల వల్ల కొన్ని అవయవాలు విఫలమవడంతో నవంబరు 23న మరణించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తరుణ్ గోగోయ్ ఆగస్టు 25న మహమ్మారి బారిన పడ్డారు. గువహటి మెడికల్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. డిశ్చార్జి(Discharge) అయిన రెండు నెలల తర్వాత చనిపోయారు.

అహ్మద్ పటేల్..(Ahmed Patel)
సీనియర్ కాంగ్రెస్ నాయకులు అహ్మద్ పటేల్.. సోనియా గాంధీకి అత్యంత ఆప్తులు. రాజకీయంగా ఆమెకు ముఖ్య సలదారుడైన అహ్మద్ పటేల్ నవంబరు 25న గురుగావ్ లో మేదాంత ఆసుపత్రిలో మృతి చెందారు. కోవిడ్-19(Covid-19) బారిన పడిన ఆరోగ్యం బాగా క్షీణించడంతో పలు అవయవాలు విఫలమై 71 ఏళ్ల వయసులో మరణించారు. ఈయన కూడా కోవిడ్-19 తర్వాత వచ్చిన పలు అనారోగ్య ఇబ్బందులతో కన్నుముశారు. కాంగ్రెస్ వెన్నుముకగా పనిచేసిన అహ్మద్ పటేల్ చాలా ఏళ్ల నుంచి ఆ పార్టీ వ్యూహాకర్తగా పనిచేశారు.

రామ్ విలాస్ పాస్వాన్..(Ramvilas paswan)
అక్టోబరు 8న రామ్ విలాస్ పాస్వాన్ చనిపోయినట్లు ఆయన కుమారుడు చిరాగ్ పాస్వాన్ తెలిపారు. కొన్ని వారాల ముందు గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అక్టోబరు 10న పాట్నాలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. సోషలిస్టు(Socialist) ఉద్యమం ద్వారా తెరపైకి వచ్చిన ఆయన దేశంలోని ప్రముఖ దళిత నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు అయిన వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖా మంత్రిగా పనిచేశారు.

సురేశ్ అంగడి..(Suresh Angadi)
కరోనా కారణంగా మరణించిన మరో ముఖ్య నాయకుడు సురేశ్ అంగడి. రాష్ట్ర రైల్వే మంత్రిగా పనిచేసిన ఆయన సెప్టెంబరు 23న కన్నుముశారు. ఆయన వయసు 65 ఏళ్లు. 1955 జూన్ 1న జన్మించారు. కర్ణాటకలోని బెల్గాం నుంచి లోక్ సభ సభ్యుడిగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. వాస్తవానికి 2004లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి అంగడి ఎప్పుడూ ఓడిపోలేదు. 1996లో బెల్గాం జిల్లా భాజపా ఉపాధ్యక్షునిగా సురేశ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2001లో భాజపా(BJP) బెల్గాం అధ్యక్షుడిగా నామినేట్ అయ్యారు. జిల్లా పదవికి ఎదిగిన మూడేళ్లకే లోక్ సభ(Lok Sabha) ఎన్నికల్లో పోటీ చేసేందుకు భాజపా టిక్కెట్ ఇచ్చింది. అప్పటి కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి అమర్సింగ్ పాటిల్ ను ఓడించి జైత్రయాత్రను కొనసాగించారు.

ప్రణభ్ ముఖర్జి..(Pranab Mukherjee)
మాజీ రాష్ట్రపతి(Ex-president) ప్రణభ్ ముఖర్జి ఈ ఆగస్టు 31న కరోనాతో మరణించారు. 2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన మూడు వారాల పాటు ఆసుపత్రులో చికిత్స పొందారు. కాగా చివరకు ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా కన్నుమూశారు. ఆగస్టు 10న కోవిడ్ తో ఆసుపత్రిలో చేరారు. 1935 డిసెంబరు 31న జన్మించిన ప్రణభ్.. భారత రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉన్నతస్థానాలను అధిరోహించారు. కాంగ్రెస్(Congress) పార్టీ క్రియాశీలక పదవులు చేపట్టారు.

అమర్ సింగ్..(Amar Singh)
సమాజ్ వాది పార్టీ మాజీ నాయకుడు, రాజ్యసభ్య(Rajya Sabha) సభ్యుడైన అమర్ సింగ్ ఆగస్టు 1న సింగపూర్ లో కన్నుమూశారు. కిడ్నీ(Kidney) సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన 64 ఏళ్ల వయసులో చనిపోయారు. 1956 జనవరి 27న ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో జన్మించారు. వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా భారత్ లో అత్యంత ప్రభావంతమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార సమాజంలో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కు అత్యంత ఆప్తులు.

లాల్ జీ టాండన్..(Lal ji Tandon)
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్ జీ టాండన్ జులై 21న మరణించారు. 85 ఏళ్ల వయసులో లక్నోలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. తెరిచిన పుస్తకంగా అందరికి సుపరిచితులైన ఆయన రాజకీయాల్లో తనకంటూ కొన్ని సరిహద్దుల్లో ఎప్పుడూ చూసుకోలేదు. పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీల్లోనూ సన్నిహితులను సంపాదించుకున్నారు.

వీరు కాకుండా మాజీ కాంగ్రెస్ నాయకుడు రామకృష్ణ ద్వివేది, పార్లమెంటేరియన్(Parlamentarian) గోపినాథ్ గజపతి నారాయణ డియో, కర్ణాటక మాజీ గవర్నర్ టీఎన్ చతుర్వేది, అజిత్ జోగి, భన్వార్ లాల్ శర్మ, శివాజిరావ్ పాటిల్ నిలాంగేకర్ తదితర నాయకులు ఈ జాబితాలో ఉన్నారు.
Published by:Sumanth Kanukula
First published: