‘ఆ నలుగురిపై వేటు వేయండి’.. వెంకయ్యనాయుడుకు టీడీపీ ఎంపీల లేఖ

ఆ నలుగురు ఎంపీలు పార్టీ ఫిరాయించినట్టేనని, వారిపై రాజ్యాంగంలోని పదో షెడ్యూల్, రెండో పేరా ప్రకారం అనర్హులుగా వేటు వేయాలని లేఖలో ఎంపీలు కోరారు.


Updated: June 21, 2019, 6:09 PM IST
‘ఆ నలుగురిపై వేటు వేయండి’.. వెంకయ్యనాయుడుకు టీడీపీ ఎంపీల లేఖ
పార్టీ మారిన నలుగురు ఎంపీలపై వేటు వేయాలంటూ వెంకయ్యనాయుడుకు లేఖ ఇస్తున్న టీడీపీ ఎంపీలు
  • Share this:
రాజ్యసభలో తెలుగుదేశం సభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ ఇచ్చిన లేఖ చెల్లదంటూ టీడీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరో లేఖ ఇచ్చారు. లోక్‌సభ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, రాజ్యసభ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, సీతా రామలక్ష్మి రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడును కలసి లేఖను అందజేశారు. నలుగురు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్, నాలుగో పేరా రెండో పాయింట్ ప్రకారం రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు లేఖ ఇచ్చారని, అయితే, ఆ నిబంధన ప్రకారం బీజేపీలో విలీనం చెల్లదన్నారు. విలీనం ఏదైనా ఆర్గనైజేషన్ లెవల్లో జరగాలన్నారు. వారిని బీజేపీ పార్లమెంటరీ పార్టీలో సభ్యులుగా పరిగణించవద్దని విజ్ఞప్తి చేశారు.

రాజ్యసభలో బీజేపీలో టీడీపీ విలీనాన్ని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీలో తీర్మానించినట్టు లేఖలో పేర్కొన్నారని, అయితే, ఆ భేటీకి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఐదుగురు ఎంపీలు స్పష్టం చేశారు. ఆ నలుగురు ఎంపీలు పార్టీ ఫిరాయించినట్టేనని, వారిపై రాజ్యాంగంలోని పదో షెడ్యూల్, రెండో పేరా ప్రకారం అనర్హులుగా వేటు వేయాలని లేఖలో ఎంపీలు కోరారు.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పదో షెడ్యూల్‌ స్కీమ్ ప్రకారం పార్టీలో విభజన వస్తే.. విలీనానికి సంబంధించి స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని.. ఆ లేఖలో ఎంపీలు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాల్సిందిగా త్వరలో టీడీపీ తరఫున రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 21, 2019, 6:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading