FIVE STATE ELECTIONS ARE LIKELY TO BE POSTPONED DUE TO THE SEVERITY OF THE OMICRON TODAY IS THE CRUCIAL MEETING OF THE ELECTION COMMISSION PRV
five states election in 2022: ఒమిక్రాన్ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా? నేడు ఎన్నికల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ కీలక సమావేశం
election-commission
భారత్ లోనూ ఒమిక్రాన్ చాపకింద నీరులా కాంటాక్టులకూ సోకుతోంది. అయితే.. వచ్చే ఏడాది ప్రారంభంలో (మరికొన్ని రోజుల్లో) ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘానికి పెద్ద సవాలుగా మారింది.
కరోనా (Corona) సెకండ్ వేవ్ లో లక్షల మందిని పొట్టనపెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ (Omicron) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. బ్రిటన్ తర్వాత ఫ్రాన్స్ లో ఒకే రోజు లక్షల పైచిలుకు కేసులు వచ్చాయి. యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ మరణాలు పెరుగుతున్నాయి. అమెరికా సహా 100 దేశాల్లో ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తి ఉంది. భారత్ (India) లోనూ ఒమిక్రాన్ చాపకింద నీరులా కాంటాక్టులకూ సోకుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో పలు రాష్ట్రాలు రాత్రి పూట కర్ఫ్యూ విధించాయి. అయితే.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ (Uttar Pradesh, Punjab, Goa, Uttarakhand, Manipur)లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ (five states election in 2022) ఎన్నికల సంఘానికి పెద్ద సవాలుగా మారింది. దీంతో ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక సమావేశం (meeting) నిర్వహించబోతుంది.
ఫిబ్రవరి , మార్చిలో..
ఎన్నికల నిర్వహణ (Election management), కరోనా తీవ్రతపై చర్చించనుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో ఎలక్షన్ కమిషన్ (Election Commission) అధికారులు కీలక భేటి నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి యూనియన్ హెల్త్ సెక్రటరీ రాకేష్ భూషణ్ (Union Health Secretary Rakesh Bhushan) హాజరవనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు (five states election in 2022) జరుగనున్నాయి. అయితే వీటిపై ఇప్పటి నుంచే సందిగ్ధం ఏర్పడింది. దేశంలో కరోనా, ఓమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇవాళ్టి సమావేశానికి (Meeting) ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు వాయిదా పడే అవకాశాలే (Elections are likely to be postponed) ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలె ఐఐటీ కాన్పూర్ సైతం ఫిబ్రవరిలో మూడో వేవ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నివేదికలో వెల్లడించింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒమిక్రాన్ నేపథ్యంలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరగడం ఎన్నికల కమిషన్‌ను ఆందోళనలో పడేసింది.
అలహాబాద్ హైకోర్టు సూచన..
కాగా, ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఎన్నికల వాయిదాను పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి ఇప్పటికే సూచనలు జారీచేసింది.వాస్తవానికి ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రచారం ఊపందుకుంది. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల్లో 2022 ఫిబ్రవరి, మార్చిల్లో ఎన్నికలు జరుగనున్నాయి. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓ వైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో నోటిఫికేషన్ ఇవ్వొచ్చా? ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? సాధ్యసాధ్యాలేంటి? ఇందుకు ఆరోగ్య శాఖ సన్నద్ధత ఎలా ఉంది ఉని తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం (Election Commission) సమావేశం అవుతుంది. ఓమిక్రాన్ తీవ్ర రూపం దాలుస్తున్న క్రమంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచన చేస్తోంది.
భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు (omicron cases) వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లకు కూడా మహమ్మారి వ్యాపించింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ బాధిత రాష్ట్రాల సంఖ్య 19కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 459 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 108, ఢిల్లీలో 79 కేసులుండగా, 44 కేసులతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త ఏడాది వేడుకలను ప్రభుత్వం నిషేధించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు పబ్లిక్ పేసుల్లో కార్యక్రమాల నిర్వహణను ప్రభుత్వం బ్యాన్ చేసింది. చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతున్నది.
తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 44కి చేరింది. దీంతో తెలంగాణలో జనవరి 2 వరకు ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.