తెలంగాణ డిప్యూటీ స్పీకర్ ఇంట్లో చోరీకి ప్రయత్నం

అయితే తెల్లవారుజామున ఇంటి గ్రిల్స్ ను తొలగిస్తూ ఐదుగురు వ్యక్తులు పద్మారావు కుటుంబసభ్యుల కంట్లో పడ్డారు.

news18-telugu
Updated: December 7, 2019, 10:59 AM IST
తెలంగాణ డిప్యూటీ స్పీకర్ ఇంట్లో చోరీకి ప్రయత్నం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు నివాసంలో కొందరు దొంగతనానికి ప్రయత్నించారు. అయితే కుటుంబసభ్యులు దొంగల్ని గుర్తించడంతో మిగతావారిని కూడా అప్రమత్తం చేశారు. దీంతో దొంగతనానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒకరు పద్మారావు పొరుగింటి వ్యక్తి కావడంతో స్పీకర్ కుటుంబసబ్యులు షాక్ తిన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు మోండా మార్కెట్ ఏరియాలోని తకార బస్తీలో నివసిస్తుంటారు. అయితే తెల్లవారుజామున ఇంటి గ్రిల్స్ ను తొలగిస్తూ ఐదుగురు వ్యక్తులు పద్మారావు కుటుంబసభ్యుల కంట్లో పడ్డారు. పద్మారావు భార్య, కుమారుడు రామేశ్వర్ గౌడ్ దొంగలను చూసి మిగతావారిని కూడా అప్రమత్తం చేశారు. వారు సిబ్బందికి ఈ విషయం తెలియజేయడంతో దొంగలను పట్టుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>