ఆర్టీసీ సమ్మె... కేసీఆర్ ముందున్న 5 ఆప్షన్స్

సమ్మెపై ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగకపోవడం... ఈ విషయంలో ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా వ్యవహరిస్తుండటంతో... ప్రజారవాణా సమ్మెకు ఫుల్ స్టాప్ పడేది ఎఫ్పుడనే విషయం ఎవరూ చెప్పలేకపోతున్నారు.

news18-telugu
Updated: October 11, 2019, 10:56 AM IST
ఆర్టీసీ సమ్మె... కేసీఆర్ ముందున్న 5 ఆప్షన్స్
తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో ఆర్టీసీ ఏడో రోజుకు చేరింది. బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కకపోవడంతో ప్రయాణీకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సమ్మెపై ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగకపోవడం... ఈ విషయంలో ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా వ్యవహరిస్తుండటంతో... ప్రజారవాణా సమ్మెకు ఫుల్ స్టాప్ పడేది ఎఫ్పుడనే విషయం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే సమ్మె నేపథ్యంలో ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి... వాటిలో ప్రభుత్వం ఏయే ఆప్షన్ల వైపు మొగ్గుచూపుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

సెలవులు పొడిగించడం: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల పాటు దసరా సెలవులను పొడిగించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇలా చేయడం వల్ల ఒక్కసారిగా తిరుగు ప్రయాణాల్లో పెరిగే రద్దీని నియంత్రించడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి మరింత సమయం దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఉద్యోగాల నోటిఫికేషన్: సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల స్థానంలో కొత్తవారిని తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్... త్వరలోనే కొత్త ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా ముందుగానే న్యాయసలహా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

ప్రత్యేక రైళ్లకు విజ్ఞప్తి:
సెలవుల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన వాళ్లు మళ్లీ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖను కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖను ప్రభుత్వం కోరనున్నట్టు సమాచారం.

మరిన్ని మెట్రో సర్వీసులు: ఇక హైదరాబాద్‌లో ఆర్టీసీ సమ్మె తీవ్రతను తగ్గించేందుకు ఎక్కువగా మెట్రోపైనే ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెట్రో రైళ్లు నడిచే మార్గాల్లో మరిన్ని అదనపు సర్వీసులను నడపాలని ఇప్పటికే సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు మెట్రో రైలు సంస్థ ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది.

కోర్టు తీర్పు తరువాత తదుపరి వ్యూహం: ఆర్టీసీ సమ్మె అంశంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా పడింది. ఆ రోజు కోర్టు ఏ రకమైన ఉత్తర్వులు ఇస్తుందో తెలిసిన తరువాత సమ్మెపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది.
First published: October 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading