HOME »NEWS »POLITICS »five mlas absent for tdlp meeting with chandrababu naidu ahead of assembly political scenario ba

టీడీఎల్పీ భేటీకి రాని ఐదుగురు ఎమ్మెల్సీలు వీరే...

టీడీఎల్పీ భేటీకి రాని ఐదుగురు ఎమ్మెల్సీలు వీరే...
టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబునాయుడు, కళా వెంకట్రావు

ఇప్పటికే ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డి టీడీపీకి దూరం అయ్యారు. మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు.

  • Share this:
    తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. శమంతకమణి, తిప్పేస్వామి, సరస్వతి, కేఈ ప్రభాకర్, శత్రుచర్ల సమావేశానికి హాజరుకాలేదు. తమ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నామని వారు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు సమాచారం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి రద్దు చేస్తామంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు టీడీఎల్పీ భేటీ నిర్వహించారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, 23 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సభలో వ్యూహంపై నిశితంగా చర్చించారు. మరీ ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా..? వద్దా..? అనే అంశంపై చర్చించనున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీఎల్పీ సమావేశానికి హాజరుకాలేమని ఐదుగురు ఎమ్మెల్సీలు ముందుగానే అధిష్టానానికి సమాచారం అందించారు. గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల, రామకృష్ణ ఈ ఐదుగురు ఇవాళ సమావేశానికి గైర్హాజరవుతున్నారు. ఎందుకు హాజరుకాలేకపోతున్నామనే దానికి వివరణ ఇచ్చుకున్నారు.

    • గాలి ముద్దు కృష్ణమ నాయుడు వర్ధంతి కనుక రాలేనని చెప్పిన గాలి సరస్వతి



    • కేఈ ప్రభాకర్ ఇంట్లో మేనత్త కర్మ కార్యక్రమం

    • అనారోగ్యం కారణంగా రాలేనని చెప్పిన శత్రుచర్ల

    • నివాసంలో పెళ్లి ఉండటంతో రాలేనని చెప్పిన తిప్పేస్వామి

    • విదేశాల్లో ఉండటంతో రాలేనని చెప్పిన ఏఎస్ రామకృష్ణ


    ఇప్పటికే ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డి టీడీపీకి దూరం అయ్యారు. మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:January 26, 2020, 14:21 IST