తెలంగాణలో ఐదుగురు మంత్రులు ఔట్..? లోక్ సభ ఎన్నికల ఫలితం...

Telangana Updates : ఫెడరల్ ఫ్రంట్ ఆశల్ని నీరుగార్చేస్తూ... లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫెయిలవ్వడంపై గులాబీ బాస్ సీరియస్‌గా ఉన్నారు. యాక్షన్ ప్లాన్ ఓ రేంజ్‌లో ఉండబోతోందని తెలిసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 28, 2019, 7:56 AM IST
తెలంగాణలో ఐదుగురు మంత్రులు ఔట్..? లోక్ సభ ఎన్నికల ఫలితం...
కేసీఆర్ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: May 28, 2019, 7:56 AM IST
సారు,కారు,పదహారు,ఢిల్లీలో సర్కారు... అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే... అదికాస్తా బెడిసికొట్టడమే కాక... తెలంగాణలో బీజేపీ దూసుకొస్తుండటంపై టీఆర్ఎస్‌ ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. 16కి బదులు తొమ్మిది సీట్లే గెలవడం, దానికితోడు డిసెంబర్‌లో భారీ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్... సొంత కూతుర్ని గెలిపించుకోలేకపోయారన్న విమర్శలు ఆయన్ని మరింత బాధపెడుతున్నట్లు తెలిసింది. అంతా బాగుందనుకుంటే, ఇలా ఎందుకు జరిగిందన్నదానిపై ఆయన ప్రక్షాళన మొదలుపెట్టారనీ, కచ్చితంగా చర్యలు తీసుకోబోతున్నారని తెలిసింది. ఎక్కడైతే టీఆర్ఎస్ అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చాయో, అక్కడి గెలుపు బాధ్యతల్ని నిర్వహించిన మంత్రుల్ని త్వరలోనే పదవుల నుంచీ తప్పిస్తారని టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది.

అభ్యర్థుల గెలుపు బాధ్యతల్ని మంత్రులకు అప్పగిస్తే, వాళ్లు ఫెయిలవ్వడం వల్ల... వాళ్లను తప్పించి, కొత్తవారికి అవకాశం ఇవ్వడమే సరైన నిర్ణయమని కేసీఆర్ తన సన్నిహితులతో అన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ లోక్ సభ స్థానం బాధ్యతలు చూసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితోపాటూ... బాల్కొండలో రవాణాశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, నల్గొండకు సంబంధించి మంత్రి జగదీశ్ రెడ్డిని త్వరలోనే తప్పిస్తారని సమాచారం. ఇప్పటికే ఈ సంకేతాలు వచ్చేయడంతో ఈ ఐదుగురు మంత్రులకూ టెన్షన్ మొదలైందట.

ఐదుగురినీ తప్పిస్తారా, ఎవరినైనా కరుణిస్తారా అన్నది తేలాల్సిన తొలి విషయం. తప్పిస్తే, వారి స్థానంలో ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది రెండో తేలాల్సిన అంశం. మొత్తానికి లోక్ సభ ఎన్నికలు తమ సీటుకి ఎసరు పెడుతున్నాయని ఆ మంత్రులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.

 ఇవి కూడా చదవండి :

జగన్ ప్రకటనతో టీడీపీలో మళ్లీ ఉత్సాహం... గుంటూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

జూన్ 5 వరకూ తీవ్ర ఎండలే... RTGS హెచ్చరిక... బయటకు వెళ్లొద్దు...
Loading...
జగన్ ప్రమాణ స్వీకారానికి జోరుగా ఏర్పాట్లు... 10 LED స్క్రీన్లు

ఆ విషయంలో చంద్రబాబు సక్సెస్... మళ్లీ మంగళగిరి నుంచే లోకేష్ పోటీ...
First published: May 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...