ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్... కేసీఆర్‌కు తొలి షాక్

ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో... టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేసే విషయంలో సీపీఐ వెనక్కి తగ్గింది.

news18-telugu
Updated: October 14, 2019, 8:02 PM IST
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్... కేసీఆర్‌కు తొలి షాక్
కేసీఆర్, ఆర్టీసీ
  • Share this:
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐ... ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో సపోర్ట్‌పై వెనక్కి తగ్గింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలపై ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో సీపీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాలను టెన్షన్ పెడుతోంది. ఆర్టీసీ సమ్మె, సమ్మెపై ప్రభుత్వ వైఖరి గురించి చర్చించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గం హైదరాబాద్‌లో సమావేశమైంది.

ఈ సమావేశంలో ఏదో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండటంతో... టీఆర్ఎస్‌కు ప్రకటించిన మద్దతును ఉపసంహరించుకోవాలని సీపీఐ నిర్ణయించుకుంది. ఆర్టీసీ ఉద్యోగులతో ఈ నెల 13లోపు చర్చలు జరపాలని సీపీఐ గతంలోనే ప్రభుత్వానికి సూచించింది. ఈ గడువు ముగియడం... ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో... హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్‌కు మద్దతిచ్చే అంశంపై సీపీఐ పునరాలోచనలో పడింది. ఇంకా టీఆర్ఎస్‌కు మద్దతిస్తే కార్మికులు దృష్టిలో తాము విలన్‌గా మిగిలిపోతామని ఆ పార్టీ నేతలు భావించారు.

ఆర్టీసీతో చర్చలపై ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడమో లేక హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్‌కు మద్దతు ఉపసంహరణపై నిర్ణయం తీసుకోవడమో చేయాలని సీపీఐ భావిస్తోంది. అయితే ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిలో పెద్దగా మార్పు రాకపోవడంతో... మద్దతుపై వెనక్కి తగ్గడమే మేలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ కారణంగానే దీనిపై అత్యవసరంగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ సమావేశంలో సీపీఐ తీసుకున్న నిర్ణయం టీఆర్ఎస్ వర్గాల్లో కొత్త ఆందోళనను రేకెత్తించింది.
Published by: Kishore Akkaladevi
First published: October 14, 2019, 8:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading