జూన్ 6 నుంచి పార్లమెంట్ సమావేశాలు ... లోక్‌సభ షెడ్యూల్‌ విడుదల

పార్లమెంటు భవనం

15 వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు.అలాగే గత ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అయితే ఈ సమావేశాల్లో పుర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు.

  • Share this:
    జూన్‌ 6 నుంచి 17 వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 6 నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 15వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.ఈ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. అలాగే స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు. 15 వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు.అలాగే గత ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అయితే ఈ సమావేశాల్లో పుర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు.పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం తర్వాత ఏర్పడబోయే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 31న జరిగే నూతన కేబినెట్ తొలి భేటీలో లోక్‌సభ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నది.

    మరోవైపు 17 వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ సీనియర్ ఎంపీ సంతోశ్ గాంగ్వర్ ఎంపికయ్యారు.స్వతంత్ర హోదాలో కార్మిక శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు.ఆయన కొత్తగా ఎన్నికైన సభ్యులందరితో ప్రమాణం చేయించడంతో పాటు స్పీకర్‌ ఎన్నిక జరిగే వరకు సభను నిర్వహిస్తారు.ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడిని నియమించే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అదే సంప్రదాయాన్ని బీజేపీ సైతం కొనసాగిస్తోంది.

    ఈ నెల 30న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు నూతన మంత్రివర్గ సభ్యులతో రాష్ట్రపతి కోవింద్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఐదేండ్ల పదవీకాలం పూర్తి చేసుకుని రెండో పర్యాయం ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న తొలి బీజేపీ నేతగా మోదీ నిలువనున్నారు. కాంగ్రెస్ నేతలు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ మాత్రమే గతంలో ఈ ఘనతను సాధించారు.
    First published: