సోనియాగాంధీకి షాక్... వాయిస్ పెంచిన 23 మంది సీనియర్లు... పార్టీలో మార్పులకు డిమాండ్

సోనియాగాంధీకి షాక్... వాయిస్ పెంచిన 23 మంది సీనియర్లు... పార్టీలో మార్పులకు డిమాండ్ (File)

Congress Party: కొడుకేమో... నాకొద్దీ అధ్యక్ష పదవి అంటారు. తల్లేమో... అనారోగ్య సమస్యలతో పోరాడుతూ... పార్టీని నడిపే స్థితిలో లేరు. మరి ఇప్పుడు నెక్ట్స్ ఏంటి? సీనియర్ల వాయిస్ రైజింగ్ వల్ల జరిగేదేంటి?

 • Share this:
  ఇండియాలో ఓవైపు రెండోసారి అధికారాన్ని చేపట్టి... బీజేపీ తన పాలన తాను చేసుకుపోతోంది. అదే సమయంలో... బలమైన ప్రతిపక్షంగా మారి... అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించాల్సిన స్థితిలో ఉండాల్సిన కాంగ్రెస్... సొంత గూటిలో సమస్యల్ని సెట్ చేసుకోలేక సతమతమవుతోంది. రోజురోజుకూ పార్టీ డౌన్‌ఫాల్‌లోకి వెళ్లిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో సమూల మార్పులు రావాల్సిందేనని... 23 మంది సీనియర్లు వాయిస్ పెంచారు. వీరిలో ఐదుకురు మాజీ సీఎంలు ఉన్నారు. చాలా మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, సిట్టింగ్ ఎంపీలు, కొంత మంది మాజీ కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్లంతా... పార్టీపై పై స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ మార్పులు జరగాలంటూ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ పంపారు.

  బీజేపీ ప్రభ పెరుగుతూ ఉండటానికి ప్రధాన కారణం యువత సపోర్ట్ బీజేపీకి ఉండటమేననీ, యూత్ వేసిన ఓట్ల ద్వారానే నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని కాగలిగారని... సీనియర్ నేతలు ఆ లేఖలో తమ అభిప్రాయాలు తెలిపారు. కాంగ్రెస్‌లో మార్పులు రాకపోవడం వల్ల యువతకు కాంగ్రెస్ దూరమైందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఎప్పుడూ కాంగ్రెస్‌లో హైకమాండ్‌కి వ్యతిరేకంగా ఇలాంటి గళాలు వినిపించలేదు. ఇప్పుడు కూడా ఇదో సూచన లాంటి అభిప్రాయం అనుకోవచ్చు. ఎందుకంటే... హైకమాండ్‌కి కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయంతోనే ఉంది. కానీ... మరోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు యువనేత రాహుల్ గాంధీ రెడీగా లేరన్నదే అసలు సమస్యగా కనిపిస్తోంది. రాహుల్‌ని ఒప్పించలేక, తాను కొనసాగలేక... సోనియా ఇబ్బంది పడుతున్నారు.

  పూరిస్థాయి హైకమాండ్ కావాలన్నది సీనియర్ల డిమాండ్. ఆ లీడర్‌షిఫ్ కూడా ప్రభావవంతంగా ఉండాలంటున్నారు. ఈమధ్య రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా చెయ్యాలనే వాదనలు వినిపించాయి. కానీ ఆమె... ఉత్తరప్రదేశ్‌పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ... అక్కడి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. అందువల్ల ఆమెకు పగ్గాలు అప్పగిస్తే... నడిపించగలరా అన్న అనుమానాలు ఉన్నాయి. 2019 నాటి పార్లమెంటరీ ఎన్నికల్లో రాహుల్ తరపున యూపీలో ఆమె ప్రచారం చేసినా... రాహుల్ అక్కడ మళ్లీ గెలవలేకపోయారు. ఫలితంగా కేరళ నుంచి ప్రాతినిధ్యం వహించాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక సమర్థతపైనా పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి.

  సోనియా కుటుంబానికి కాకుండా మరెవరికైనా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే... అప్పుడు కాంగ్రెస్... గాంధీ కుటుంబం నుంచి వేరే వారి చేతిలోకి వెళ్లినట్లవుతుంది. ఇలా జరిగితే... అధి కాంగ్రెస్‌కి ప్లస్ కంటే మైనస్సే ఎక్కువ అవుతుందనే అభిప్రాయమూ ఉంది. తాజా లేఖపై సంతకం చేసినవారిలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్, కాంగ్రెస్ ఎంపీలు, మాజీ కేంద్ర మంత్రులు ఆనంద్ శర్మ, కపిల్ సిబల్, మనీష్ తివారీ, శశిథరూర్ వంటివారున్నారు. CWC సభ్యులైన ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాద్, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు... భూపీందర్ సింగ్ హుడా, రాజేందర్ కౌల్ భట్టాల్, ఎం వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చవాన్, పీజే కురియన్, అజయ్ సింగ్, రేణుకా చౌదరి, మిలింద్ దేవరా... ఇలా చాలా మంది ఉన్నారు.

  ప్రస్తుతం తమ పాలన బాగుందని బీజేపీ చెప్పుకుంటున్నా... నిజానికి... దేశంలో మతపరమైన సమస్యల్ని బీజేపీ తెస్తోందనీ, పార్టీలో సంఘ్ పరివార్ జోక్యం ఎక్కువైందని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు. దీనికితోడు... ఆర్థికమాంద్యం, నిరుద్యోగం, కరోనా సమస్యలు, సరిహద్దు సమస్యలు, చైనాతో ఘర్షణలు, కలసిరాని విదేశీ పాలసీ... ఇలా ఎన్నో అంశాలు ఉన్నా... వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి... బీజేపీపై వ్యతిరేకత పెంచడంలో కాంగ్రెస్ ఫెయిలవుతోందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. మరి అధినేత్రి సోనియా ఏం చేస్తారన్నది తేలాల్సిన అంశం. ఇదివరకు ఆమె... ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా దాన్ని వదులుకున్నారు. తద్వారా తనకు పదవులపై వ్యామోహం లేదనే సంకేతం ఇచ్చారు. ఇప్పుడు స్వయంగా పార్టీ పెద్దలే... మార్పులు రావాలని కోరుతుంటే... ఆమె తన పదవిలో కొనసాగుతారని అనుకోలేం. అందువల్ల త్వరలోనే కాంగ్రెస్‌లో భారీ సంస్కరణలు, మార్పుల వంటివి వస్తాయని ఆశించవచ్చు.
  Published by:Krishna Kumar N
  First published: