• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • FIRST PHASE POLLING COMPLETED IN ANDHRA PRADESH PANCHAYAT ELECIONS HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఫలితాలకు రంగం సిద్ధం

AP Panchayat Elections: ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఫలితాలకు రంగం సిద్ధం

పంచాయతీ ఎన్నికల్లో ముగిసిన తొలిదశ పోలింగ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) తొలివిడత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి 75.58 పోలింగ్ శాతం నమోదైంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల్లో 7,506 మంది... వార్డులకు 43,601 మంది పోటీలో నిలిచారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 500 పంచాయతీలు వైసీపీ మద్దతుదారులు, 18 చోట్ల వైసీపీ మద్దతుదారులు, 7చోట్ల ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6.30 గంటలు దాటిన తర్వాత ఫలితాలు వెలువడనున్నాయి.
    Published by:Purna Chandra
    First published: