నేడు ప్రారంభం కానున్న 17వ లోక్‌సభ.. విశేషాలివే..

Parliament Session | లోక్‌సభ స్పీకర్ ఎన్నిక 19వ తేదీన జరుగుతుంది. అనంతరం 20వ తేదీన పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు.

news18-telugu
Updated: June 17, 2019, 12:05 AM IST
నేడు ప్రారంభం కానున్న 17వ లోక్‌సభ.. విశేషాలివే..
పార్లమెంట్ (image: Getty Images)
news18-telugu
Updated: June 17, 2019, 12:05 AM IST
17వ లోక్‌సభ నేడు కొలువుదీరనుంది. ఏప్రిల్, మే నెలల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రెండు రోజుల పాటు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ఎన్నికైన 542 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తమిళనాడులోని వేలూరు నియోజకవర్గంలో ధన ప్రవాహం ఎక్కువగా ఉందన్న కారణంతో అక్కడ ఎన్నిక జరగలేదు. వారి ప్రమాణస్వీకారం తర్వాత ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను ఎన్డీయే ప్రభుత్వం నామినేట్ చేయనుంది. లోక్‌సభలో అత్యంత సీనియర్ అయిన బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన వీరేంద్ర కుమార్.. 1996 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి జరిగిన ఆరు లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. రేపు ఉదయం రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి కోవింద్ ఎదుట ఆయన ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేస్తారు.

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక 19వ తేదీన జరుగుతుంది. అనంతరం 20వ తేదీన పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈసారి కూడా మహిళా స్పీకర్‌ను ఎన్నుకొంటారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ ఎంపీ మేనకాగాంధీ స్పీకర్‌గా ఎన్నికవ్వొచ్చంటూ ప్రచారం జరుగుతోంది. లోక్‌సభాపక్ష నేతగా ప్రధాని మోదీ, ఉప నేతగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యవహరిస్తారు. రాజ్యసభలో కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ సభానాయకుడు, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉపనాయకుడిగా వ్యవహరిస్తారు.

ఈ సారి పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. ఇద్దరు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడ లేకుండానే జరగనున్నాయి. 28 సంవత్సరాలుగా అసోం నుంచి రాజ్యసభ సభ్యుడైన మన్మోహన్ సింగ్ పదవీకాలం ముగిసిపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేవెగౌడ ఓటమిపాలయ్యారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, ఉమా భారతి లాంటి వారు పోటీ చేయలేదు. గత లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించిన మల్లికార్జున ఖర్గే, ఉప నేతగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయారు.

First published: June 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...