FIRST DISHA POLICE STATION STARTS WILL SOON AT RAJAHMUNDRY SB
రాజమండ్రిలో మొట్టమొదటి దిశా పోలీస్ స్టేషన్... రెండు రోజుల్లో ప్రారంభం,
దిశ చట్టం పై కేంద్రం కొన్ని టెక్నికల్ క్లారిఫికేషన్ అడిగినట్లుగా తెలిపారు. అవి పూర్తి చేసి మళ్లీ దిశా చట్టాన్ని కేంద్రానికి పంపినట్లుగా సుచరిత పేర్కొన్నారు.
దిశ చట్టం పై కేంద్రం కొన్ని టెక్నికల్ క్లారిఫికేషన్ అడిగినట్లుగా తెలిపారు. అవి పూర్తి చేసి మళ్లీ దిశా చట్టాన్ని కేంద్రానికి పంపినట్లుగా సుచరిత పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో త్వరలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం కానుంది. ఈనెల 7 ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతలు మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దిశా చట్టం అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పోలీసులకు ఈ చట్టం అములకు సంబంధించి శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. మహిళా భద్రతపై ముఖ్యమంత్రి చిత్తశుద్దితో ఉన్నారని సుచరిత తెలిపారు. మహిళా భద్రత కోసమే దిశా చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి ఏపీలో నే సంవత్సరానికి 12 నుంచి 15 వేల కేసులు నమోదు అవుతున్నాయన్నారు హోంమంత్రి. శిక్ష కూడా వెంటనే పడుతుందన్న భయంతో నేరాలు తగ్గుతాయని ఆశిస్తున్నామన్నారు. అనేక రాష్ట్రాలు దిశా చట్టం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. దిశా చట్టం పై కేంద్రం కొన్ని టెక్నికల్ క్లారిఫికేషన్ అడిగినట్లుగా తెలిపారు. అవి పూర్తి చేసి మళ్లీ దిశా చట్టాన్ని కేంద్రానికి పంపినట్లుగా సుచరిత పేర్కొన్నారు.
దిశా చట్టం ప్రకారం అత్యాచార కేసు నమోదైనా... అది 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి... సరైన సాక్ష్యాధారాలు ఉంటే... దోషులకు కేసు నమోదైనప్పటి నుంచీ 21 రోజుల్లో శిక్ష అమలు చెయ్యాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. మహిళలు, చిన్నారులపై తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తారు. సోషల్ మీడియా, ఫోన్లలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, ప్రవర్తించినా రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా తప్పదు. ఇలాంటి చాలా ఆసక్తికర అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి. అందుకే దీన్ని ప్రతిపక్షం కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే కేంద్రం తాజాగా దిశ చట్టంలో కొన్ని సవరణలు చేయాలని ఆ చట్టాన్ని ఆమోదించకుండా తిరిగి ఏపీకి పంపింది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.