FIRE BREAKS OUT AT KERALA SECRETARIAT OPPOSITION ALLEGES CONSPIRACY TO SABOTAGE EVIDENCE IN GOLD SMUGGLING PROBE SK
కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఫైల్స్
కేరళ సచివాలయంలో మంటలు
సచివాలయంలో అగ్నిప్రమాదం వెనక సీపీఎం ప్రభుత్వం కుట్ర ఉందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. సచివాలయం ఎదుట విపక్ష నేతలు బైఠాయించి ఆందోళన చేశారు. వారిపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించి చెదరగొట్టారు.
కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం ఘటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. సెక్రటేరియేట్‌లోని నార్త్ బ్లాక్‌లో ఉన్న ప్రొటోకాల్ డిపార్ట్మెంట్లో మంగళవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. సాయంత్రం 4.45 సమయంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఈ మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశాయి. ఐతే అప్పటికే పలు కంప్యూటర్లు, ముఖ్యమైన దస్త్రాలు కాలి బూడిదయ్యాయని తెలుస్తోంది. ఐతే తిరువనంతపురం ఎయిర్‌పోర్టు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అసిస్టెంట్ ప్రొటోకాల్ ఆఫీసర్ ఎంఎస్ హరిక్రిష్ణన్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సమన్లు జారీచేసిన మరసటి రోజే ఈ ప్రమాదం జరగడంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీని వెనక కుట్ర ఉందని.. సాక్ష్యాలను ధ్వంసం చేశారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించిన అతి ముఖ్యమైన దస్త్రాలన్నీ కాలి బూడిదయ్యాయి. వాటికి బ్యాకప్ కూడా లేదు. ఇది అనుమానాస్పద కేసు. దీనికి సీఎం పినరయి విజయనే బాధ్యత వహించాలి.
— రమేష్ చెన్నితాల, కాంగ్రెస్ నేత
సచివాలయంలో అగ్నిప్రమాదం వెనక సీపీఎం ప్రభుత్వం కుట్ర ఉందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. మంగళవారం రాత్రి సచివాలయం ఎదుట విపక్ష నేతలు బైఠాయించి ఆందోళన చేశారు. వారిపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించి చెదరగొట్టారు.
Thiruvananthapuram: Police use water cannons to disperse protesters outside the Kerala Secretariat.
BJP & Congress were holding protest alleging that the fire that broke out at Secretariat today was a conspiracy to destroy evidence in connection with #GoldSmugglingCase. pic.twitter.com/EdZ1xHZwJY
కేరళలోని రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో జులై 4న భారీగా బంగారం పట్టుబడింది. తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కాన్సులేట్‌కు చెందిన పార్శిల్లో రూ.15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో సంచలన సృష్టించింది. ఓ దేశ దౌత్య కార్యాలయానికి సంబంధించిన పార్శిల్లో ఇంత మొత్తంలో బంగారం అక్రమంగా రవాణా చేస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడటం దేశంలో ఇదే తొలిసారి.
ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్.. కేరళ సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు రాజకీయ దుమారం రేపడంతో పినరయి విజయన్ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. సీఎం విజయన్ ప్రమేయంపైనా ఎన్ఏఐ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కేరళ సచివాలయంలో అగ్నిప్రమాదం జరగడంపై ఇప్పుడు మరోసారి తీవ్ర దుమారం రేగుతోంది. దీని వెనక ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల హస్తముందని విపక్షలు మండిపడుతున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.