Home /News /politics /

FIR FILED ON AKHILESH YADAV FOR VIOLATING MCC TALKING TO MEDIA OUTSIDE POLLING BOOTH PVN

UP Elections : అఖిలేష్ యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదు

అఖిలేష్ యాదవ్ పై ఎఫ్ఐఆర్

అఖిలేష్ యాదవ్ పై ఎఫ్ఐఆర్

Case On Akhilesh Yadav :  సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై ఉత్తరప్రదేశ్‌ లోని ఓ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం మూడవ దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే సైఫాయ్ లోని ఓ పోలింగ్ బూత్‌ లో భార్యతో కలిసి

ఇంకా చదవండి ...
FIR On Akhilesh Yadav : సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై ఉత్తరప్రదేశ్‌ లోని ఓ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఎఫ్ఐఆర్ నమోదైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం మూడవ దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే సైఫాయ్ లోని ఓ పోలింగ్ బూత్‌ లో భార్యతో కలిసి ఓటేసిన అఖిలేష్ యాదవ్.. పోలింగ్ బూత్ బయటే విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శలు చేశారు. బాబా సీఎం "80:20" కాన్సెప్ట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. 80 శాతం బీజేపీతో, 20 శాతం మంది ఎస్పీతో ఉన్నారని బాబా సీఎం అన్నారని.. కానీ వాస్తవం ఏమిటంటే,యూపీలో 80 శాతం మంది ప్రజలు SP నేతృత్వంలోని కూటమితో ఉన్నారని, 20 శాతం మంది బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని, మొత్తం 100 శాతం మంది SPకి మద్దతు ఇస్తున్నారని అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే అఖిలేష్ తీరు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని పేర్కొంటూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సెక్షన్ 130 మరియు 188 కింద సైఫాయ్ పోలీస్ స్టేషన్‌ లో అఖిలేష్ యాదవ్‌ పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

అఖిలేష్ యాదవ్ మొట్టమటిసారి అసెంబ్లీ ఎన్నిల బరిలోకి దిగుతున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అసెంబ్లీ పోరులోకి దిగడం ఇదే మొదటిసారి. వీరిరువురూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పలుమార్లు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ తర్వాత శాసన మండలి నుంచి సభ్యత్వం పొందారు. ఈ ఎన్నికల్లో అఖిలేష్ పోటీ చేసిన నియోజకవర్గమైన కర్హాల్ కి ఆదివారం మూడో దశలో పోలింగ్ జరిగింది. యాదవ్ స్వయంగా కర్హాల్ నుండి ఎన్నికల బరిలో నిలిచారు.

ALSO READ UP Elections : ఈ ఎన్నికలు ముస్లిం,హిందు,యాదవుల గురించి కాదు..యోగి 80-20 వ్యాఖ్యలపై షా

మరోవైపు, యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఈనెల 23న జ‌ర‌గ‌నున్న నాలుగో ద‌శ పోలింగ్‌పై ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు దృష్టి సారించాయి. నాలుగో ద‌శ పోలింగ్‌కు చివ‌రిరోజైన సోమ‌వారం ప్ర‌చారం హోరెత్తించాయి. సోమ‌వారం సాయంత్రం ఐదు గంట‌ల‌కు ప్ర‌చార గ‌డువు ముగిసింది. 9 జిల్లాల్లోని 60 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో నాలుగో ద‌శ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. తొలి మూడు ద‌శ‌ల్లో 403 స్ధానాలున్న యూపీలో 172 సీట్ల‌కు పోలింగ్ జ‌రిగింది. ఇక నాలుగో ద‌శ‌లో 624 మంది అభ్య‌ర్ధులు త‌మ అదృష్టం పరీక్షించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి ప‌ట్టున్న ల‌క్నో, రాయ్‌బ‌రేలి ప్రాంతాల్లో ఇదే విడ‌త పోలింగ్‌ జ‌ర‌గ‌నుండ‌టంతో నాలుగో ద‌శ ఆయా పార్టీల‌కు రాజకీయంగా కీల‌కంగా మారింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Akhilesh Yadav, Police Case, Samajwadi Party, UP Assembly Elections 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు