హోమ్ /వార్తలు /రాజకీయం /

సోనియాగాంధీపై కేసు నమోదు...

సోనియాగాంధీపై కేసు నమోదు...

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆస్పత్రిలో చేరారు.

కర్ణాటకలోని శివమొగ్గలో ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు పోలీసులు సోనియాగాంధీ మీద పలు సెక్షన్ల కింద ఎఫ్ఆర్ నమోదు చేశారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై ఎఫ్ఆర్ నమోదైంది. PM CARES Fund మీద కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో మే 11వ తేదీన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి సోనియాగాంధీ మీద కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు పోలీసులు సోనియాగాంధీ మీద పలు సెక్షన్ల కింద ఎఫ్ఆర్ నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను సోనియాగాంధీ హ్యాండిల్ చేస్తారని ఆరోపణతో ఆమె మీద కేసు నమోదు చేశారు. కేవీ ప్రవీణ్ అనే న్యాయవాది సోనియాగాంధీ మీద ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలను పోస్ట్ చేశారని ఆరోపించారు. పీఎం కేర్స్ ఫండ్ మీద సోనియాగాంధీ తప్పుడు ఆరోపణలు చేశారని న్యాయవాది ప్రవీణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మే 11వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పీఎం కేర్స్ ఫండ్ మీద విమర్శలు వచ్చాయి. పీఎం కేర్స్ ఫండ్‌ను పీఎం కేర్స్ ఫ్రాడ్‌గా అభివర్ణిస్తూ ట్వీట్స్ వచ్చాయి.

First published:

Tags: Congress, Pm modi, Sonia Gandhi

ఉత్తమ కథలు