• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • FINANCE MINISTER NIRMALA SITHARAMAN GIVES CLARITY ON WHY CENTRE DID NOT ENCOURAGE GST EXEMPTION SK

కోవిడ్ మందులపై జీఎస్టీని రద్దు చేయలేం.. కారణం ఇదే.. మమతకు నిర్మల కౌంటర్

కోవిడ్ మందులపై జీఎస్టీని రద్దు చేయలేం.. కారణం ఇదే.. మమతకు నిర్మల కౌంటర్

దేశీయ తయారీదారులు ముడిపదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక ... వాటి ధరలను పెంచుతారని చెప్పుకొచ్చారు. చివరకు ఆ భారం వినియోగదారుడిపైనే పడుతుందని పేర్కొన్నారు.

దేశీయ తయారీదారులు ముడిపదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక ... వాటి ధరలను పెంచుతారని చెప్పుకొచ్చారు. చివరకు ఆ భారం వినియోగదారుడిపైనే పడుతుందని పేర్కొన్నారు.

  • Share this:
    ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌ భారత దేశాన్ని కబళిస్తోంది. మందులు, ఆక్సిజన్, వ్యాక్సిన్‌ల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధిక ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్‌లు, మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లi, ఇతర కోవిడ్ సామాగ్రిపై విదిస్తున్న పన్నులను రద్దు చేయలని విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు లేఖరాశారు. కరోనా చికిత్సలో వాడే ముందులు, వైద్య పరికరాలపై పన్నులను పూర్తిగా రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ లేఖకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానం ఇచ్చారు. టీకాలు, ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఇతర పరికరాల ధరలను అదుపులో ఉంచేందుకే జీఎస్టీని విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లతో మమతకు కౌంటర్ ఇచ్చారు.

    ప్రస్తుతం కరోనా టీకాపై 5 శాతం, ఇతర ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12 శాతం పన్ను ఉందని నిర్మల సీతారామన్ తెలిపారు. ఆయా వస్తువులకు జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే ప్రజలకే ఇబ్బందులు వస్తాయని వెల్లడించారు. దేశీయ తయారీదారులు ముడిపదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక ... వాటి ధరలను పెంచుతారని చెప్పుకొచ్చారు. చివరకు ఆ భారం వినియోగదారుడిపైనే పడుతుందని పేర్కొన్నారు.


    ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, దాని ముడిపదార్థాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ జనరేట్లు, ఆక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్స్, ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంక్స్ సహా ఇతర పరికరాలపై దిగుమతి సుంకాలు, ఐజీఎస్టీని తగ్గించినట్లు వివరించారు. సంబంధిత ఔషధాల జాబితాను కూడా ట్వీట్‌ చేశారు. మే3 నుంచి రెమెడిసివిర్ ఇంజెక్షన్, దాని తయారీకి అవసరమైన రసాయనాలపై అన్ని రకాల సుంకాలను తగ్గించామని చెప్పారు.
    దేశంలో 45 ఏళ్లు వయసు పైడిన వారికి కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్‌ వేయిస్తోందని.. దానికి కేంద్రమే పన్ను చెల్లిస్తోందని ఆమె తెలిపారు.

    అంతేకాదు ఐజీఎస్టీ వసూలయ్యే నిధుల్లో ఎక్కువ భాగం రాష్ట్రాలకే వెళ్తుందని నిర్మల సీతారామన్ స్పష్టత నిచ్చారు. ఒక వస్తువుపై 100 రూపాయలు ఐజీఎస్టీ వస్తే.. కేంద్రానికి రూ.50 (CGST) , రాష్ట్రానికి రూ.50 (SGST) వస్తుందని తెలిపారు. సీజీఎస్టీలో మరో 41శాతం వరకు రాష్ట్రాలకే వెళ్తుందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. తద్వారా ఆ 100 రూపాయల్లో 70.50 రూపాయల వరకు రాష్ట్రాలకే అందుతుందని స్పష్టం చేశారు.

    ఇండియాలో వరుసగా మూడో రోజు 4 లక్షలకు పైగా కేసులు రాగా, వరుసగా రెండో రోజు 4వేలకు పైగా మరణాలు వచ్చాయి. ఇండియాలో 24 గంటల్లో యాక్టివ్ కేసులు 13,202 మాత్రమే పెరిగాయి. ఇదివరకు లక్ష దాకా పెరిగేవి. అంటే రికవరీలు పెరుగుతున్నాయి. ఇది మంచి పరిణామం. మహారాష్ట్రలో కొత్తగా 56,578 కేసులు రాగా, 864 మంది చనిపోయారు. ఆ తర్వాత అత్యధికంగా కర్ణాటకలో 47,563 కేసులు రాగా... 482 మంది చనిపోయారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు