హోమ్ /వార్తలు /politics /

AP Financial Status: ఏపీ ఆర్ధిక పరిస్థితిపై కుండబద్దలు కొట్టిన బుగ్గన... అప్పులు ఎంత ఉన్నాయంటే..!

AP Financial Status: ఏపీ ఆర్ధిక పరిస్థితిపై కుండబద్దలు కొట్టిన బుగ్గన... అప్పులు ఎంత ఉన్నాయంటే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై (Andhra Pradesh Financial Status) కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు (AP Politics) ప్రభుత్వం చేస్తున్న అప్పుల చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పులపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (AP Finance Minister Buggana Rajendranath Reddy) క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై (Andhra Pradesh Financial Status) కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు (AP Politics) ప్రభుత్వం చేస్తున్న అప్పుల చుట్టూనే తిరుగుతున్నాయి. సంక్షేమ పథకాల (AP Welfare Schemes) పేరుతో ప్రజలకు డబ్బులు పంచడమే కాకుండా.. ఇళ్ల స్థలాలు, నాడునేడు పనుల్లో అధికార పార్టీ నేతలు భారీగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అటు కేంద్రం కూడా ఏపీ అప్పులపై పరిమితి విధించిందని.. నిధుల కోసం ఢిల్లీలో నానా తిప్పలు పడాల్సి వస్తోందన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (AP Finance Minister Buggana Rajendranath Reddy) కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, వ్యయాలు, అప్పులు ఇలా అన్ని లెక్కలను బయటపెట్టారు.

  ఈ మేరకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితులకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని బుగ్గన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ఇప్పటివరకు రూ.7,130 కోట్లకు పైగా ఖర్చుచేసినట్లు తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్రప్రభుత్వ ఆదాయానికి గండిపడిందన్న ఆయన.. మహమ్మారి వల్ల ఖజానాకు ఆదాయం తగ్గలేదన్న ప్రతిపక్షాల వాదనలో అర్ధం లేదన్నారు. గత ఏడాది కాలంగా పన్నుల్లో పెరుగుదల లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,947 కోట్ల రాబడిని కోల్పోయిందన్నారు.

  ఇది చదవండి: కొందరికి లాభం.. మరికొందరికి నష్టం... పోలవరంతో వారికి ప్రమాదం..

  రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.1.27 కోట్ల అప్పులు చేసినట్లు బుగ్గన వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కింద రూ.1.05 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామన్నారు. అప్పుల్లో అధిక భాగం సంక్షేమానికే వెచ్చిస్తున్నామన్న బుగ్గన.., ముఖ్యంగా చదువుపైనే ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు చదువే పెద్ద ఆస్తి అని.. వివిధ పథకాల కింద వారి తల్లలు ఖాతాల్లో ఇప్పటివరకు రూ.25,914.13 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ల కింద అర్హులైన వారికి రూ.37,461.89 కోట్లు పంపిణీ చేశామన్నారు. అలాగే వివిధ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, పథకాల కింద ఆర్ధిక సాయం జమ చేశామన్నారు. కరోనా కష్టకాలంలో ఆదాయం తగ్గినా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినట్లు తెలిపారు.

  ఇది చదవండి: రన్నింగ్ లో ఉండగా ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు... ఫోటోలు వైరల్..

  తాము ప్రజలకు ఇంత చేస్తున్నా ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం ఒక వ్యూహం ప్రకారం అవాస్తవాలతో విషప్రచారం చేస్తోందని బుగ్గన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేసి ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారాయన. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేసిన ప్రతిపక్ష నేతలు.. ఇప్పుడు ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. జీఎస్డీపీలో అదనంగా రెండు శాతం అప్పుగా తీసుకొచ్చేందుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితికి లోబడే తాము అప్పులు చేస్తున్నామని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.

  First published:

  Tags: Andhra Pradesh, Buggana Rajendranath reddy, TDP, Ysrcp

  ఉత్తమ కథలు