చంద్రబాబు ఏమైనా బిన్ లాడెన్‌నా ? సంచలన ట్వీట్ చేసిన వర్మ

వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హట్ టాపిక్‌గా మారింది. మరోవైపు టీడీపీ నేతలు ఎప్పటిలాగానే...మండిపడుతున్నారు.

news18-telugu
Updated: August 23, 2019, 5:23 PM IST
చంద్రబాబు ఏమైనా బిన్ లాడెన్‌నా ? సంచలన ట్వీట్ చేసిన వర్మ
రాంగోపాల్ వర్మ, చంద్రబాబు నాయుడు (File)
  • Share this:
మాజీ సీఎం చంద్రబాబు ఇంటిమీదకు డ్రోన్లు వదలడంపై తాజాగా సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు దీనిపై ఆయన తన ట్టిట్టర్ వేదికగా పలు సంచలన  వ్యాఖ్యలు చేశారు.  చంద్రబాబుకు ఎందుకంత భయం అన్న వర్మ... ఆయన ఏమైనా ఒసామా బిన్ లాడెన్ లాంటివాడా ? లేదా ఆయన ఇంటి పెరట్లో ఏమైనా దాచిపెట్టాడా ? అంటూ ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్.. ఊరికే అడుగుతున్నా అంటూ వర్మ ట్వీట్ చేశారు. దీంతో వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హట్ టాపిక్‌గా మారింది. మరోవైపు టీడీపీ నేతలు ఎప్పటిలాగానే...మండిపడుతున్నారు.

కృష్ణానదికి భారీ వరద నీరు చేరడంతో.... కరకట్టపై ఉన్న పలు ఇళ్లలోకి వాననీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు ఇంటికి కూడా వరద ముప్పు ఉందంటూ హెచ్చరించారు. శుక్రవారం చంద్రబాబునాయుడు ఇల్లు పరిసర ప్రాంతాలపై వరద తీవ్రతను అంచనా వేసేందుకు ఇరిగేషన్ శాఖా అధికారులు డ్రోన్లు వదిలిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కుట్ర పూర్వకంగానే చంద్రబాబు ఇంటిమీదకు వరద వదిలారని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.First published: August 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు