• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • FIGHTING BETWEEN YSRCP AND TELUGU DESHAM SUPPORTS DURING 4TH PHASE PANCHAYAT ELECTIONS IN ANDHRA PRADESH HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: పోలింగ్ రోజున వైసీపీ-టీడీపీ ఫైటింగ్... పంచాయతీ ఎన్నికల్లో టెన్షన్ టెన్షన్

AP Panchayat Elections: పోలింగ్ రోజున వైసీపీ-టీడీపీ ఫైటింగ్... పంచాయతీ ఎన్నికల్లో టెన్షన్ టెన్షన్

పంచాయతీ ఎన్నికల్లో టెన్షన్ వాతావరణం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) చివరి దశ పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో టెన్షన్ వాతావరం నెలకొంది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో టెన్షన్ వాతావరం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఘర్షణలు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లాయి. దొంగఓట్లు, పోలింగ్ కేంద్రంలో ప్రచారం, ప్రలోభాలకు గురిచేయడం వంటి కారణాలతో గ్రామాల్లోని ప్రధాన పార్టీల మద్దతుదారుల మధ్య ఘర్షలు చెలరేగుతున్నాయి. పోలీసులు రంగప్రవేశంతో ఘర్షణలకు అడ్డుకట్ట పడుతోంది. కృష్ణాజిల్లా ఏ.కొండూరు మండలం రామచంద్రాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక టీడీపీ నేత కృష్ణారెడ్డి దంపతులు ఓటు వేసేందుకు వెళ్తుంగా.. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఓటర్లను ప్రలోభపెడుతున్న కారణంగా అడ్డుకున్నామని ప్రత్యర్థి వర్గం చెప్తోంది.

    ఇక గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం, ఫణిదం పోలిగం కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ ఏజెంట్ విషయంలో మొదలైన వివాదం మాటామాటా పెరిగి ఉద్రిక్తతలకు దారి తీసింది. ధూళిపాళ్ల పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా, ఐ.పోలవరంలో టీడీపీ-వైసీపీ మద్దతుదారుల మధ్య కొట్లాట జరిగింది. ఘటనలో ఒకరికి గాయాలవగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. లీసులు ఇరువర్గాలను చెదరగొట్టాయి. పోలింగ్ బూత్ వద్ద మాటామాట పెరగడమే ఘర్షణకు కారణంగా తెలుస్తోంది.

    నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వడ్డిపాలెం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ జరిగింది. ఒకరి ఓటును మరొకరు వేయడంతో వివాదం మొదలైంది. దీంతో ఓ వర్గం వారు ఆందోళనకు దిగారు. కొందరు మహిళలు ఓటు వేసేందుకు వెళ్లగా.. అప్పటికే వారికి సంబంధించిన ఓట్లు వేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఓటర్లు తమ మద్దతుదారులకు చెప్పడంతో పోలింగ్ సిబ్బందితో వాగ్వాదం జరిగింది. దీనిపై పోలింగ్ ఏజెంట్లు సర్దిచెప్పినా వినలేదు.

    కర్నూలు జిల్లా కోసిగి పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిరాగు. టీడీపీ మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కావాలనే టీడీపీ నేతలను అదుపులోకి తీసుకొని రిగ్గింగ్ కు సహకరిస్తున్నట్లు ఆ పార్టీ వారు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో క్యూలైన్ల వద్ద వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పోలీసులు వారిని పంపేశారు. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీలోని పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దొంగఓట్లు వేస్తున్నారంటూ కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు