వైసీపీలో వార్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాటలు

నెల్లూరు జిల్లాలో పట్టు కోసం నేతల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి తన హవా నడిపించాలని చూస్తున్నారు.

news18-telugu
Updated: October 8, 2019, 3:31 PM IST
వైసీపీలో వార్.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కుమ్ములాటలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీలోని ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోందా? నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీఓ సరళ మీద దాడి చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. తన అరెస్ట్ వెనుక నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలతో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు అంటే.. అది ‘బాస్‌’కి తెలియకుండా చేస్తారా? కాదు. కోటంరెడ్డి బంధువు కృష్ణారెడ్డి వెంకటాచలం మండలంలో ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్ వేశాడు. దానికి వాటర్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా గత కొన్ని రోజులుగా కోరుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీఓకు ఫోన్ చేసి విషయం అడిగితే.. ‘మా ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దన్నాడు.’ అని చెప్పినట్టు కోటంరెడ్డి వెల్లడించారు. ఇదే విషయాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. కాకాణికి ఫోన్ చేస్తే.. ‘నీకు తెలీదు. నువ్వు ఊరుకో’ అని చెప్పినట్టు స్వయంగా శ్రీధర్ రెడ్డి మీడియాకు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. కేబినెట్‌లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు స్థానం లభించింది. అయితే, జిల్లాలో పట్టు కోసం నేతల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి తన హవా నడిపించాలని చూస్తున్నారు. అయితే, తన నియోజకవర్గంలో తన మాటే నెగ్గాలని మరికొందరు చూస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఈ క్రమంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద ఎంపీడీఓ సరళ ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు కాకాణి అనుచరులు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. కాకాణి ఒత్తిడి వల్లే పోలీసులు తన మీద వ్యక్తిగత కక్ష తీర్చుకుంటున్నారని శ్రీధర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

Video : ఆటోలకు వైసీీపీ స్టిక్కర్లు అతికిస్తూ దొరికిన రవాణా శాఖ సిబ్బంది

Published by: Ashok Kumar Bonepalli
First published: October 8, 2019, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading