FEDERAL FRONT IS ON CARDS AFTER TELUGU STATES ANNOUNCED WAR ON BJP LED CENTRAL GOVERNMENT FULL DETAILS HERE PRN GNT
Federal Front: బీజేపీపై జగన్-కేసీఆర్ యుద్ధానికి కారణం ఇదేనా..? అసలు వ్యూహం వేరే ఉందా..? డైరెక్షన్ ఆయనదేనా..?
ప్రతీకాత్మకచిత్రం
ప్రస్తుతం కేంద్రంలో భారతీయ జనతాపార్టీ (Bharathiya Janatha Party) నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏ కూటమితో బరిలో దిగినా బీజేపీకి సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వచ్చింది. దీంతో కేంద్రంలో తిరుగులేని పార్టీగా బీజేపీ ఉంది.
ప్రస్తుతం కేంద్రంలో భారతీయ జనతాపార్టీ (Bharathiya Janatha Party) నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎన్డీఏ కూటమితో బరిలో దిగినా బీజేపీకి సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వచ్చింది. దీంతో కేంద్రంలో తిరుగులేని పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీ ఘన విజయంతో ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల పాత్ర నామమాత్రంగానే ఉందని చెప్పాలి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్ఆర్సీపీ (YSRCP), టీఆర్ఎస్ (TRS) పార్టీలు ఢిల్లీలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. పార్లమెంటులో అవసరమైనప్పుడు కేంద్రానికి సహకరించడం తప్ప.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలను గట్టిగా పట్టుబట్టి తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గతంలో ప్రచారంలోకి వచ్చిన ఫెడరల్ ఫ్రంట్ (Federal Front) మరోసారి వార్తల్లోకి వస్తోంది. ఇటీవల పలుచోట్ల జరిగిన ఉపఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఫ్రంట్ పేరు మళ్లీ పాలిటిక్స్ లో వినిపిస్తోంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు ఫెడరల్ ఫ్రెంట్ లో కీలక పాత్ర పోషిస్తారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. బద్వేలులో వైసీపీ.. బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓడించడం, అటు హుజురాబాద్ ఫలితం తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటించడం ఫెడరల్ ఫ్రంట్ వార్తలకు మరింత ఊపొచ్చింది. ఇకపై అన్ని అంశాల్లోనూ కేంద్రాన్ని టార్గెట్ చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు మండుతున్నాయి. వంట గ్యాస్ ధరలు ఏ మాత్రం నియంత్రణ లేదు. వంట నూనెలతో పాటు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలెక్కుపెడుతున్నాయి. ఈ ధరల పెరుగుదల పాప పుణ్యం మొత్తం కేంద్ర ప్రభుత్వం ను నడుపుతున్న బీజేపీదే నని తాము పెట్రోల్ ధరలు తగ్గించేది లేదంటూ ఇటీవల పీ ప్రభుత్వం పేపర్లో ప్రకటనలిచ్చి మరీ స్పష్టం చేసింది.
నిన్నటివరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతిచ్చిన వైసీపీ.. ఇటీవల పరిణామాల తర్వాత ఆ పార్టీని టార్గెట్ చేస్తూ వస్తోంది. అసలు అదో పార్టీనే కాదు అన్నట్లుగా వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయి. మంత్రి కొడాలి నాని అయితే బిజేపి ఒక సిల్లి పార్టి అని దాని గురించి మాట్లడటం కూడా వేస్ట్ అనడం ఇందుకు నిదర్శనం. ఒకరిద్దరు మంత్రులు కూడా బీజేపీపై నేరుగా విమర్శలు చేయడం గమనార్హం.
మరోవైపు తెలంగాణ ముఖ్య మంత్రి కేసిర్ జీజెపి పై తను పోరాడుతానని నాయకులను బొక్కలో వేస్తానని సంచలన వాఖ్యలు చేశారు. ఒకేసారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీపై తిరుగుబావుటా ఎగురవేయడంతో ఈ రెండు పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ లో లీడ్ రోల్ పోషిస్తాయన్న చర్చ జరుగుతోంది. ఈ తిరుగు బావుటా వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహం వుందని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి వాటి సపోర్టుతో వచ్చే ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలన్న ప్లాన్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రాంతీయ పార్టీలకు బీజేపీపై పోరాడేందుకు లీడ్స్ ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.