ఫెడరల్ ఫ్రంట్: 13న చెన్నైకి వెళ్లనున్న సీఎం కేసీఆర్

ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ మరో ముందడుగు వేస్తున్నారు. ఈ నెల 13న చెన్నై వెళ్లనున్నారు. అక్కడ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఆయన ఇంట్లో కలవనున్నారు.

news18-telugu
Updated: May 7, 2019, 9:08 AM IST
ఫెడరల్ ఫ్రంట్: 13న చెన్నైకి వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్)
  • Share this:
ఫెడరల్ ఫ్రంట్ దిశగా మళ్లీ చర్చలు మొదలు పెట్టిన తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం కేరళలో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. తిరువనంతపురం వెళ్లిన కేసీఆర్.. అక్కడ అనంత పద్మనాభస్వామిని దర్శించుకొని, విజయన్‌తో సమావేశమయ్యారు. కలిసిరండి అంటూ.. వామపక్షాలకు పిలుపునిచ్చిన ఆయన ఫెడరల్ ఫ్రంట్‌లో చేరాలని కోరారు. దాదాపు గంటన్నర సేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రతిపాదనలు ఆచరణీయమని విజయన్ అన్నారు. దీనిపై పార్టీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ మరో ముందడుగు వేస్తున్నారు. ఈ నెల 13న చెన్నై వెళ్లనున్నారు. అక్కడ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఆయన ఇంట్లో కలవనున్నారు.

గత ఏడాది ఏప్రిల్‌లో చెన్నైకి వచ్చిన కేసీఆర్‌ అప్పుడు డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించారు. అలాగే స్టాలిన్‌తో ఫెడరల్‌ ఫ్రంట్‌ అంశంపై చర్చించారు. రెండు రోజులపాటు చెన్నైలో ఉన్న కేసీఆర్‌కు డీఎంకే సాదర స్వాగతం పలికింది. తర్వాత ఆగస్టులో కరుణానిధి అంత్యక్రియలకు సీఎం హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి 13న చెన్నై రానున్నారు. ఈ సందర్భంగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళి, ఫలితాల అనంతరం తలెత్తే పరిణామాలు, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అంశాలపై వారిద్దరు చర్చించనున్నారు.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఐదు దశలు పూర్తికావడం, మిగిలిన రెండు దశలు కూడా ఈ నెల 19న ముగియనుండగా 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ప్రస్తుతం కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారోనని జోరుగా చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, బీజేపీకి సొంతంగా మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం లేదని, మూడో ఫ్రంట్‌ లేదా బీజేపీయేతర పక్షాల కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో ప్రధానిగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో కొంతకాలంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరు కూడా వినిపిస్తోంది. చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌ మరోసారి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అలాగే సోమవారం కేరళకు బయలుదేరే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది.15, 16 తేదీల్లో బెంగళూరుకు రావాలని కేసీఆర్‌ను కుమారస్వామి ఆహ్వానించారు.
First published: May 7, 2019, 9:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading