Home /News /politics /

మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతున్నారా ? ఓ పత్రిక సంచలన కథనం

మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతున్నారా ? ఓ పత్రిక సంచలన కథనం

 నారా లోకేష్ (ఫైల్ ఫోటో)

నారా లోకేష్ (ఫైల్ ఫోటో)

మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్న లోకేష్‌కు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత గెలుపు సులువుకాదని తెలిసివచ్చిందన్నారు ప్రస్తుతం ఆయన టెన్షన్‌లో ఉన్నారని కథనంలో ప్రచురించింది.

    ఏపీ రాజకీయాలు రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్నాయి. అందుకే ఇతర రాష్ట్రాల పత్రికలు సైతం ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామలపై సంచలన కథనాలు రాస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.  దీంతో రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా మీడియా కూడా ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. మంగళగిరి నుంచి ఈసారి ఎన్నికల్లో లోకేష్ పోటీకి దిగారు. అయితే లోకేష్ గెలుపోటములపై ఇప్పటికే ఏపీలో జోరుగా బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఓ పత్రిక .... ‘దిన మలర్’ మంగళగిరిలో నారా లోకేష్ గెలుపుపై ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఏపీ మంత్రి నారా లోకేష్‌కు మంగళగిరిలో ఓడిపోతానన్న భయం ఉందనేది ఆ కథనం సారాంశం. తండ్రి సీఎం అయినా కూడా... ఓటమి తప్పదేమో నన్న భయం లోకేష్‌లో ఉందని... మంత్రిగా ఉండి కూడా కచ్చితంగా గెలుస్తానన్న ధైర్యం ఆయనలో లేదని పత్రిక రాసింది. మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొంటున్న లోకేష్‌కు ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత గెలుపు సులువుకాదని తెలిసివచ్చిందన్నారు ప్రస్తుతం ఆయన టెన్షన్‌లో ఉన్నారని కథనంలో ప్రచురించింది.

    మంగళగిరలో లోకేష్ విజయవకాశాలపై ఇప్పటికే అనేక వార్తలు తెరపైకి వస్తున్నాయి. లోకేష్‌కూడా పర్సనల్‌గా తన గెలుపుపై ఉన్న అవకాశాలపై సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ పత్రికలో లోకేష్ గెలుపుపై ఇలాంటి కథనాలు ప్రచురించడం మరోసారి ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP News, AP Politics, Mangalagiri, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు