రాళ్లపాడు ప్రాజెక్టు రైతుల ధర్నా.. ఫోన్ చేసి భరోసా ఇచ్చిన సీఎం జగన్

తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఈ అక్రమ పైపులైన్లను ప్రోత్సహిస్తున్నారంటూ ఎమ్మెల్యే మానుగుంట ఆవేదన వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: June 11, 2019, 12:50 PM IST
రాళ్లపాడు ప్రాజెక్టు రైతుల ధర్నా.. ఫోన్ చేసి భరోసా ఇచ్చిన సీఎం జగన్
సీఎం జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఈరోజు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి నెల్లూరులోని చింతలదీవిలో కామధేనువు పశువులు పునరుత్పత్తి కేంద్రానికి నీరు అందించేందుకు అక్రమంగా నిర్మిస్తున్న పైపులను తొలగించాలని కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి ఆందోళనకు దిగారు. తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఈ అక్రమ పైపులైన్లను ప్రోత్సహిస్తున్నారంటూ ఎమ్మెల్యే మానుగుంట ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట రైతులు, వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ప్రాజెక్టు వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.

రాళ్లపాడు వద్ద నెలకొన్న ఉద్రిక్తతపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన జగన్ మొత్తం ఘటనపై ఆరా తీశారు. వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ఈ విషయమై మహిధర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడిన సీఎం.. సంబంధిత జీవోను రద్దుచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి, రైతులు ఆందోళన విరమించారు. ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తంచేశారు.

Published by: Sulthana Begum Shaik
First published: June 11, 2019, 12:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading