తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుబంధు పథకంలో తప్పులు దొర్లుతున్నాయి. ఖరీఫ్ సీజన్ పంటకు రైతులకు పడవలసిన డబ్బులు జులై చివరి వారానికి వస్తున్నా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేవు. గత వారం రోజుల కింద కొంత మంది రైతులకు వారి ఖాతాలో రైతుబంధు పథకం డబ్బులు పడినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ పేరుతో రైతుల ఫోన్లకు మెస్సేజ్ లు వచ్చాయి. తీరా రైతులు బ్యాంకుకు వెళ్తే అధికారులు రైతు బంధు పథకం డబ్బులు మీ ఖాతాలో జమ కాలేదు అని చెప్తున్నారు. జూన్ మొదటి వారంలో మెదక్ జిల్లాలో 60 శాతం మంది రైతులకు రైతు బంధు పథకం డబ్బులు వచ్చాయి. మిగతా 40 శాతం మంది రైతులకు ఇప్పటివరకు డబ్బులు పడలేవు. గత వారం కింద 40 శాతం మంది రైతులకు ఫోన్ కి మెసేజ్ వచ్చింది. తీరా రైతులు బ్యాంకు దగ్గరికి వెళ్తే డబ్బులు జమ కాలేదని చేతులెత్తేశారు. అయితే రైతులు ఏం చేయాలో తోచక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు మీ ఖాతాలోకి డబ్బులు వచ్చినయ్ అని బ్యాంకుకు వెళ్లి తెచ్చుకోండి అని చెప్తున్నారు. వర్షాలు లేక పత్తి మొక్కలు ఎండకి వాడి చూపుతున్నాయి. మాకు పెట్టుబడి పెట్టిన డబ్బులు వస్తాయని అనుకుంటే ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు రాలేదని అని చెప్తున్నారు రైతులు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.