Home /News /politics /

FARMER UNIONS THREATEN TO HOLD PROTEST AGAINST AGAINST PM MOIDI PUNJAB VISIT ON FEB 14 AMIT SHAH SLAMS PUNJAB CM CHANNI MKS

PM Moidi : మరోసారి మోదీకి పరాభవం తప్పదా? -రైతుల వార్నింగ్ -ఆ సీఎంపై అమిత్ షా ఫైర్

పంజాబ్ లో మోదీ భద్రతా వైఫల్యం(గత నెల ఫొటో)

పంజాబ్ లో మోదీ భద్రతా వైఫల్యం(గత నెల ఫొటో)

ప్రమాదకర చేదు అనుభవం ఎదురైనప్పటికీ పంజాబ్ విషయంలో పట్టువీడని ధోరణి ప్రదర్శిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గతంలో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్నప్పటికీ మరోసారి పంజాబ్ ప్యటనకు సిద్ధమయ్యారాయన..

పైప్రమాదకర చేదు అనుభవం ఎదురైనప్పటికీ పంజాబ్ విషయంలో పట్టువీడని ధోరణి ప్రదర్శిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గతంలో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్నప్పటికీ మరోసారి పంజాబ్ ప్యటనకు సిద్ధమయ్యారాయన. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మోదీ ఈనెల 14, 16, 17 తేదీల్లో పంజాబ్ లో పర్యటించనున్నారు. అయితే, గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రధానిని అడ్డుకుంటామని, ఆయన ప్రయాణించే రోడ్డు మార్గాలను నిర్బంధిస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి. పంజాబ్ కాంగ్రెస్ సర్కారు పెద్దలు సైతం ప్రధాని హెలికాప్టర్ లో మాత్రమే రావాలని వ్యాఖ్యానించారు. దీంతో ప్రధాని భద్రత విషయమై కేంద్రం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం మళ్లీ పెద్దదైంది. వివరాలివి..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రహాసనం తుది ఘట్టానికి చేరుకుంది. ఈనెల 20న పోలింగ్ ఉండటంతో 17 సాయంత్రంతో ప్రచారపర్వం ముగియనుంది. పంజాబ్ ఎన్నికల్లో ప్రధాని మోదీ సోమవారం(ఈనెల 14న) తొలి సభ జలంధర్ లో నిర్వహించ తలపెట్టారు. ఆ వెంటనే ఫిబ్రవరి 16న పఠాన్ కోట్ లో, ఫిబ్రవరి 17న అబోహార్ లో మోదీ సభలు జరుగనున్నాయి. నిజానికి మోదీ గత నెలలో(జనవరి 3న )నే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఫిరోజ్ పూర్ బయలుదేరినా.. మార్గం మధ్యలో రైతులు అడ్డగించడంతో ఢిల్లీకి వెనుదిరిగారు. ఆ సందర్భంలో ‘ప్రాణాలతో బయటపడ్డానని మీ సీఎంకు థ్యాంక్స్ చెప్పండి’అని ప్రధాని మోదీ.. ఓ పంజాబ్ అధికారితో అన్నట్లుగా వార్తలొచ్చాయి. నాడు మోదీని అడ్డుకున్న రైతులే ఇప్పుడు మరోసారి కూడా పరాభవం తప్పదని హెచ్చరిస్తున్నారు.

CM KCR అనూహ్యం : సడన్‌గా Rahul Gandhiపై ప్రేమ ఎందుకు? గులాబీ బాస్ ఏం మెసేజ్ ఇస్తున్నారు?సంయుక్త్ కిసాన్ మోర్ఛా(ఎస్కేఎం)గా కొనసాగుతోన్న పంజాబ్ కు చెందిన 23 రైతు సంఘాలు.. ప్రధాని పర్యటనను అడ్డుకొని తీరుతామని హెచ్చరించాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతులను కేంద్రం ఏడాదిపాటు నిర్బంధించడం, వేల మంది ప్రాణాలు కోల్పోవడం, చట్టాలను వెనక్కి తీసుకున్నా ఇతర డిమాండ్ల విషయంలో కేంద్రం మళ్లీ పాత పాటే పాడుతోన్న దరిమిలా రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈనెల 14, 16, 17 తేదీల్లో ప్రధాని మోదీ ఎన్నికల సభలకు వచ్చే మార్గాలను నిర్బంధిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. అంతేకాదు, ఫిబ్రవరి 14న పంజాబ్ వ్యాప్తంగా మోదీ దిష్టి బొమ్మల దహనం, అదే రోజు అన్ని గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు, ఈనెల 16 అన్ని మండల కేంద్రాల్లో నిరసనలకు కిసాన్ మోర్ఛా పిలుపునిచ్చింది. దీంతో మోదీకి మరోసారి పరాభవం ఎదురయ్యే అవకాశాలు నెలకొన్నాయి. కాగా,

Hijab Row: హిజాబ్ వివాదంపై CM KCR సంచలన వ్యాఖ్యలు : చీకట్లోకి సిలికాన్ వ్యాలీ!ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ సర్కారుపై కేంద్రం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. జనవరి 3న ప్రధాని భద్రతా వైఫల్యం ఘటనపై సుప్రీంకోర్టు విచారిస్తుండటం తెలిసిందే. పంజాబ్ రైతులు ఈసారి కూడా ప్రధానిని అడ్డుకుంటామని ప్రకటించిన క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పంజాబ్ కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడికి దిగారు. ‘దేశ ప్రధానమంత్రికే భద్రత కల్పించలేని అసమర్థ సీఎం చన్ని. ప్రధానికే భద్రత కల్పించలేకుంటే ఇక సామాన్య పంజాబీలను ఏం కాపాడగలడు?’అని అమిత్ షా ఫైరయ్యారు. పంజాబ్ కాంగ్రెస్ మంత్రులు మాత్రం.. ప్రధాని ఆకాశమార్గంలోనే రావాలని, రోడ్డుపై వస్తే రైతులు అడ్డుకునే అవకాశముందని అంటున్నారు. దీంతో సోమవారం నాటి మోదీ పంజాబ్ పర్యటనపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది..
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Bjp, Pm modi, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు