• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • FAMILY POLITICS BECOMING GRABBING PUBLIC ATTENTION DURING ANDHRA PRADESH PANCHAYAT ELECTION HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: సర్పంచ్ పదవిని గిఫ్టుగా ఇచ్చుకున్న అత్తాకోడళ్లు.. ఎక్కడో తెలుసా..?

AP Panchayat Elections: సర్పంచ్ పదవిని గిఫ్టుగా ఇచ్చుకున్న అత్తాకోడళ్లు.. ఎక్కడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

AP Panchayat Elections: అత్తాకోడళ్లంటే ఉప్పు నిప్పులా ఉంటారు. నిత్యం గొడవలు పడుతుంటారు. కానీ ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునే అత్తాకోడళ్లు ఉన్నారంటే నమ్ముతారా..? ఇది నిజమే

  • Share this:
    అత్తాకోడళ్లంటే ఉప్పు నిప్పులా ఉంటారు. నిత్యం గొడవలు పడుతుంటారు. కానీ ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునే అత్తాకోడళ్లు ఉన్నారంటే నమ్ముతారా..? ఇది నిజమే. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓ గ్రామంలో అత్తకోసం కోడలు, మరో గ్రామంలో కోడలి కోసం అత్త నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని చల్లగుండ్ల సర్పంచ్ అభ్యర్థులుగా అత్తకోడళ్లైన బత్తుల బేబీ, బత్తుల ఉమా నామినేషన్లు వేశారు. ఐతే ఇక్కడ ఎన్నిక ఏకగ్రీవం కావడం కోసం స్థానిక నేతలు ప్రయత్నాలు జరపడంతో అత్తను సర్పంచ్ చేయడం కోసం కోడలు ఉమ తన నామినేషన్ ను వెనక్కి తీసుకుంది. దీంతో అత్త బత్తుల బేబి గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    ఇక దేవవరం గ్రామ పంచాయతీలో అత్తాకోడళ్లైన భూ లక్ష్మీ, ఆది లక్ష్మీ నామినేషన్లు దాఖలు చేశారు. రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఐతే ఇక్కడ కోడలిని సర్పంచ్ చేయడం కోసం అత్తగారైన ఆదిలక్ష్మి తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. దీంతో కోడలు భూలక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

    ఇదిలా ఉంటే ఏపీలోని మరో జిల్లాలో అత్తాకోళ్లకు ఒకరిపై ఒకరు పోటీకి దిగారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని మాతల గ్రామంలో అత్తాకోడళ్లు పంచాయతీ ఎన్నికల్లో పోటీపడుతుంటం అందరిని దృష్టని ఆకర్షిస్తోంది. అందులో అత్తకు టీడీపీ మద్దతుగా నిలుస్తుండగా, కోడలుకు వైసీపీ మద్దతిస్తోంది. అయితే వారిద్దరు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్‌రావు కుటుంబ సభ్యులు కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. కలమట మోహనరావు సతీమణి కలమట వేణమ్మ టీడీపీ నుంచి , చిన్న కోడలు కలమట సుప్రియ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. గతంలో నాలుగు సార్లు వేణమ్మ గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. అయితే ఈసారి కోడలే వేణమ్మపై పోటీకి నిలవడంతో.. ఎవరు సర్పంచ్ అవుతారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం వేణమ్మ, సుప్రియలు జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు.

    రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసేనాటికి ఇంకెన్ని ఫ్యామిలీ పాలిటిక్స్ వెలుగులోకి వస్తాయో చూడాలి.
    Published by:Purna Chandra
    First published: