పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం... పరువు నష్టం దావా వేస్తామన్న జనసేన...

పవన్ కళ్యాణ్‌కు అమరావతిలో 62 ఎకరాల భూమి ఉన్నట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన ఆరోపించింది.

news18-telugu
Updated: January 25, 2020, 5:31 PM IST
పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం... పరువు నష్టం దావా వేస్తామన్న జనసేన...
పవన్ కళ్యాణ్ (Twitter/Photo)
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అమరావతిలో 62 ఎకరాల భూములు ఉన్నాయంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ ఆరోపించింది. తప్పుడు పత్రాలు సృష్టించి గోబెల్స్ ప్రచారంచేస్తున్నారని మండిపడింది. వారిపై పరువునష్టం కేసు వేస్తామని జనసేన పార్టీ న్యాయవిభాగం కోఆర్డినేటర్ సాంబశివరావు ప్రతాప్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘జనసేనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నీచబుద్ధితో బురద జల్లడానికి కొందరు ప్రజావ్యతిరేకులు కుట్రలు పన్ని తమ అనుచరగణంతో వాటిని అమలు చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని జనసేన చేస్తున్న ప్రజాపోరాటానికి కోట్లాది గొంతులు తోడు ఉండడంతో.. ఎదురొడ్డి పోరాడలేని అల్పబుద్దిగలవాళ్లే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు అమరావతిలో 62 ఎకరాల భూములు ఉన్నాయని తప్పుడు పత్రాలు సృష్టించి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేస్తున్న వారిపైన, సోషల్ మీడియాలో వక్రరాతలు రాస్తున్న వారిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. వారిపై పరువు నష్టం దావా వేయనున్నాం. ఒకటి రెండు రోజుల్లో వారందరికీ లీగల్ నోటీసులు పంపుతాం.’ అని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు