నేనే సీఎం.. బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్

మిత్రపక్షంతో ఉన్న అభిప్రాయ భేదాలు త్వరలోనే తొలగిపోతాయని తెలిపారు. శివసేన మద్దతుతో భారీ మెజార్టీతో కూటమి గెలిచిందన్న ఆయన.. ఉద్ధవ్ థాక్రేకు ధన్యవాదాలు చెప్పారు.

news18-telugu
Updated: October 30, 2019, 4:16 PM IST
నేనే సీఎం.. బీజేపీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్
న్యూస్ 18 క్రియేటివ్
  • Share this:
మహారాష్ట్రలో మిత్రుల వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. సీఎం సీటుపై పంచాయితీ ఇంకా తేలలేదు. కానీ బీజేపీ మాత్రం సీఎం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. బుధవారం సౌత్ ముంబైలోని విధాన భవన్‌లో జరిగిన బీజేపీ సమావేశానికి కొత్తగా ఎన్నికైన 105 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అందరూ దేవేంద్ర ఫడ్నవీస్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీంగా ఎన్నుకున్నారు. కేంద్ర పరిశీలకులుగా ఈ సమావేశానికి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ ఉపాధ్యక్షుడు అవినాష్ రాయ్ కన్నా హాజరయ్యారు.

శాసనసభా పక్షనేతగా ఎన్నికైన అనంతరం మీడియాతో మాట్లాడిన దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. మిత్రపక్షంతో ఉన్న అభిప్రాయ భేదాలు త్వరలోనే తొలగిపోతాయని తెలిపారు. శివసేన మద్దతుతో భారీ మెజార్టీతో కూటమి గెలిచిందన్న ఆయన.. ఉద్ధవ్ థాక్రేకు ధన్యవాదాలు చెప్పారు.

ఇది అతి పెద్ద విజయం. 1995 నుంచి ఏ పార్టీకి కూడా 75కు మించి స్థానాలు దక్కలేదు. కానీ 2014, 2019లో మాత్రం బీజేపీకి 100కు పైగా స్థానాల్లో విజయం సాధించిది. మహాయుతికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
దేవేంద్ర ఫడ్నవీస్


288 అసెంబ్లీ సీట్లు మహారాష్ట్రలో బీజేపీ కూటమి 163 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 103 స్థానాలకే పరిమితమైంది. ఇతరులకు 22 స్థానాలు దక్కాయి. బీజేపీ కూటమిలో బీజేపీకి 105 సీట్లు రాగా..శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. ఐతే బీజేపీకి గతంలో పోల్చితే కొన్ని సీట్లు తగ్గితే.. శివసేన తన గ్రాఫ్‌ను పెంచుకుంది. ఈ క్రమంలో సీఎం పీఠంపై కన్నేసింది శివసేన. సీట్ల పంపకానికి ముందే 50-50 ఫార్ములాతో ఒప్పందం చేసుకున్నామని.. దాన్ని అమలు చేయాలని పట్టబట్టుతోంది. దీని ప్రకారం చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది.
First published: October 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>