గురువారం లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అయిపోయింది. తన ఇంట్లోనే 9 ఓట్లు ఉంటే తనకు కేవలం 5 ఓట్లు మాత్రమే వచ్చాయని ఓ అభ్యర్థి వెక్కివెక్కి ఏడుస్తున్న వీడియో బాగా సర్క్యులేట్ అవుతోంది. "మా కుటుంబంలోనే 9 ఓట్లు ఉన్నాయి. కానీ నాకు కేవలం 5 ఓట్లు రావడం షాకిచ్చింది. నాకు ఓటు వేస్తానని మా వీధిలో ఉన్నవారంతా చెప్పారు. చివరకు నాకు వచ్చిన ఓట్లు ఐదే. ఎవరూ నాకు ఓటు వేయలేదు" అంటా ఆ అభ్యర్థి ఓ విలేకరికి చెప్పుకొని ఏడుస్తున్న వీడియో అది. ఆ అభ్యర్థి పేరు నీతు షట్టారన్ వాలా. పంజాబ్లోని జలంధర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన కుటుంబంలో 9 మంది ఉంటే 5 ఓట్లు వచ్చాయంటే, కుటుంబ సభ్యులే ఓటు వేయలేదన్న అనుమానాలు కలిగాయి. ఈ వీడియో వైరల్గా మారడంతో అందరూ అతనిపై జాలి చూపించారు. నవ్వారు. ఆ వీడియో ఇదే.
😂😂😂😂😄😄😄😄😅😆
i am sorry, but i couldn't stop myself from laughing
‘Neetu shutteran vala’, independent candidate from jalandhar got only FIVE votes. He has a family of nine. pic.twitter.com/H8wrKpaVGl
ఇంట్లో 9 ఓట్లు ఉంటే కేవలం 5 మంది మాత్రమే అతనికి ఓటు వేశారా? సొంత కుటుంబ సభ్యులే ఆ అభ్యర్థికి ఓటు వేయకుండా హ్యాండ్ ఇచ్చారా? ఇందులో నిజానిజాలేంటీ? ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. వీడియోలో తను అలాగే చెప్పుకొని ఏడ్చాడు కాబట్టి అదే నిజమనుకొని జాలిపడుతున్నారు. వీడియోను బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. కానీ అసలు నిజమేంటో తర్వాత తేలింది. ఆ అభ్యర్థికి 5 ఓట్లు వచ్చాయన్నది అవాస్తవం. కౌంటింగ్ ముగిసిన తర్వాత తేలిన విషయం ఏంటేంటే ఆ స్వతంత్ర అభ్యర్థికి 856 ఓట్లు వచ్చాయి. జలంధర్ నియోజకవర్గంలో ఫలితాలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో చూస్తే అసలు లెక్క తేలింది. ఆ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జలంధర్ నియోజకవర్గంలో నీతు షట్టారన్ వాలాకు వచ్చిన ఓట్లు (image: ECI)
ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో చూస్తే నీతు షట్టారన్ వాలా పేరు 19వ నెంబర్లో ఉంది. ఆయనకు వచ్చిన ఓట్లు మొత్తం 856. మరి తనకు ఐదు ఓట్లే వచ్చాయని ఎవరు చెప్పారో తెలియదు. దీంతో తనకు 5 ఓట్లే వచ్చాయని, కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయలేదన్న బాధతో ఏడ్చేశాడు. అసలు వాస్తవం మరుగునపడిపోయింది. 5 ఓట్లు మాత్రమే వచ్చాయని ఏడ్చే వీడియో మాత్రం వైరల్గా మారింది.
నెహ్రూ నుంచి మోదీ వరకు... ఎవరేం చదివారో తెలుసుకోండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.