• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • FACT CHECK DID PM MODI MEETS EX PM MANMOHAN SINGH TO DISCUSS GDP BS

Fact Check: సలహాల కోసం మన్మోహన్‌ సింగ్‌ను ప్రధాని మోదీ కలిశారా?

Fact Check: సలహాల కోసం మన్మోహన్‌ సింగ్‌ను ప్రధాని మోదీ కలిశారా?

ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

Fact Check: ఆర్థిక రంగాన్ని పట్టాలెక్కించేందుకు ఆర్థిక వేత్త అయిన మన్మోహన్ సూచనలను మోదీ కోరారని, అందుకే ఆయన ఇంటికి వెళ్లి కలిశారని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దానికి 45 సెకన్ల వీడియోను కూడా జత చేశారు.

  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఈ మధ్య కలిశారా? కుదేలైన జీడీపీ రేటును పెంచేందుకు ఆ దిశగా ఇద్దరు కలిసి చర్చలు జరిపారా? ఆర్థిక రంగాన్ని పట్టాలెక్కించేందుకు మన్మోహన్ సూచనలను ప్రధాని మోదీ కోరారా?.. కొందరు నెటిజన్లు ప్రధాని మోదీ, మన్మోహన్‌ను కలిసిన వీడియోను పోస్ట్ చేస్తూ నిజమేనని చెబుతున్నారు. వాస్తవానికి దేశ ఆర్థిక స్థితిని సూచించే జీడీపీ వృద్ధి రేటు భారీగా క్షీణించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన తొలి క్వార్టర్లో దేశ స్థూల జాతీయ ఆదాయం వృద్ధిరేటు (జీడీపీ) 0.8 శాతం క్షీణించి 5 శాతంగా నమోదైంది. ఈ క్షీణతతో ఏడేళ్ల కనిష్ట స్థాయికి జీడీపీ పతనం అయ్యింది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు వెళుతున్న వేళ, వృద్ధి రేటు ఇలా భారీగా క్షీణించడంతో ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని క్వార్టర్లుగా ఆటో, తయారీరంగం, రియల్ ఎస్టేట్ లాంటి పలు రంగాల్లో మాంద్యం జీడీపీ క్షీణతకు సూచికగా నిలిచింది.

ఇది దేశ అభివృద్ధికి విఘాతంగా మారింది. దీంతో మళ్లీ ఆర్థిక రంగాన్ని పట్టాలెక్కించేందుకు ఆర్థిక వేత్త అయిన మన్మోహన్ సూచనలను కోరారని, అందుకే ఆయన ఇంటికి వెళ్లి కలిశారని జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దానికి 45 సెకన్ల వీడియోను కూడా జత చేశారు. అయితే.. మన్మోహన్‌ను మోదీ కలిసిన విషయం వాస్తవమే. కానీ అది తాజాగా జరిగిన సంఘటన కాదు. 2014 ఎన్నికల్లో బీజేపీ గెలిచి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక.. మర్యాద పూర్వకంగా కలిశారు. జీడీపీ చర్చల సందర్భంగా కలిశారని చేస్తున్న ప్రచారం అంతా అబద్ధం.



First published: