Fact Check: పశ్చిమబెంగాల్ లో BJPతో AIMIM పొత్తు? ఈ సంచలన వార్త వాస్తవమేనా?

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తాము ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నామంటూ బీజేపీ ట్విట్టర్ లో ప్రకటించినట్లు ఓ పోస్టు స్క్రీన్ షాట్ తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే.. ఈ వార్త వెనుక ఉన్న వాస్తవం ఇదే..

news18-telugu
Updated: November 24, 2020, 6:56 PM IST
Fact Check: పశ్చిమబెంగాల్ లో BJPతో AIMIM పొత్తు? ఈ సంచలన వార్త వాస్తవమేనా?
మోదీ, అసదుద్దీన్ ఓవైసీ(ఫైల్ ఫొటో)
  • Share this:
సోషల్ మీడియాలో నిజమైన వార్తల కన్నా, ఫేక్ న్యూస్ సంచారమే అధికంగా పెరిగిపోయింది. కొందరు అదే పనిగా తప్పుడు వార్తలను సృష్టించి ఇంటర్ నెట్లోకి వదులుతున్నారు. దీంతో అనేక మంది అమాయకులు అదే నిజమనుకుని వాటికి రియాక్ట్ అవుతున్నారు. అలాంటి వార్తలను షేర్ చేస్తున్నారు. దీంతో తప్పుడు వార్తల సంచారం పెరిగిపోతోంది. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి ఫేక్ వార్తలను తయారు చేసే వారి సంఖ్య సైతం అధికమైంది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల రోజు ఉదయం కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరాడని ఓ ప్రముఖ టీవీ చానల్ లోగోతో ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యమైంది. దీన్ని కొంత మంది నమ్మారు కూడా. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తనపై కొందరు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తప్పుడు ప్రచారం కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ నేతలు ఎంఐఎంను టార్గెట్ గా చేసుకుని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అయితే తమకు ఎంఐఎంతోనే పోటీ అంటూ ఇటీవల వాఖ్యానించారు. ఆ రెండు పార్టీల మధ్య పరిస్థితి ఇలా ఉంటే.. రానున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తాము ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నా మంటూ బీజేపీ ట్విట్టర్ లో ప్రకటించినట్లు ఓ పోస్టు స్క్రీన్ షాట్ తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.





అనేక మంది ఇది నిజమని నమ్మి రియాక్ట్ కూడా అవుతున్నారు. ఓ వైపు తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా మరో వైపు ఈ పొత్తు ఏంటన్న చర్చ సోషల్ మీడియాలో అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ట్వీట్ ను పరిశీలిస్తే ఫేక్ అని తేలింది. ఎవరో కావాలనే ఈ ట్వీట్ ను సృష్టించారని తెలుస్తోంది. బీజేపీ ట్విట్టర్ అధికారిక ఖాతాలో ఇటీవలి కాలంలో ఏఐఎంఐఎం గురించి అసలు ఎలాంటి ట్విట్లే చేయలేదు.
Published by: Nikhil Kumar S
First published: November 24, 2020, 6:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading