Home /News /politics /

FACEBOOK TWITTER SOCIAL MEDIA BEING ABUSED TO HACK DEMOCRACY AND USED TO POLITICAL NARRATIVES SAYS CONGRESS SONIA GANDHI MKS

విద్వేష వ్యాపకాలుగా Facebook Twitter.. సోషల్ మీడియాతో రాజకీయ అరాచకం: Sonia Gandhi

లోక్ సభలో సోనియా ప్రసంగం

లోక్ సభలో సోనియా ప్రసంగం

సోషల్ మీడియాపై సోనియా గంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్, ట్విటర్ విద్వేష వ్యాపకాలుగా మారాయని, బీజేపీ లాంటి పార్టీలకు సహకరిస్తూ అరాచక రాజకీయాలకు కారణమవుతున్నాయని ఆరోపించారు.

సోషల్ మీడియాను ఉద్దేశించి జాతయ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్ సభ జీరో అవర్ లో మాట్లాడిన ఆమె.. ఫేస్ బుక్, ట్విటర్ విద్వేష వ్యాపకాలుగా మారాయని, బీజేపీ లాంటి పార్టీలకు సహకరిస్తూ అరాచక రాజకీయాలకు కారణమవుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్, అల్‌జజీరా, ది రిపోర్టర్‌ లాంటి మీడియా సంస్థలు రాసిన ఇన్వెస్టిగేటివ్ కథనాలను సోనియా ప్రస్తావించారు.

లోక్‌స‌భ జీరో అవ‌ర్‌లో ఇవాళ సోనియా గాంధీ మాట్లాడారు. ఫేస్‌బుక్‌తో పాటు ఇత‌ర సోష‌ల్ మీడియా వ్య‌వ‌స్థ‌లు చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆమె అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఫేస్‌బుక్ విద్వేషాన్ని పెంచుతున్న‌ట్లు ఆమె ఆరోపించారు. అన్ని రాజ‌కీయ పార్టీల‌కు స‌మాన‌మైన అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని ఫేస్‌బుక్‌ను ఆమె నిందించారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న వారిని ఫేస్‌బుక్‌, ఇత‌ర సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల‌తో టార్గెట్ చేస్తున్నార‌ని ఆమె ఆరోపించారు.

Bullet Train: హైదరాబాద్-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు.. వయా చిట్యాల-జగ్గయ్యపేట -మంచి లాభం: Uttam


ఎన్నికల ప్రకటన కోసం ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే, బీజేపీకి చౌకైన ఆఫర్లను ఫేస్‌బుక్‌ అందించిందని రిపోర్టుల్లో వెల్లడైనట్లు సోనియా గుర్తుచేశారు. గ్లోబ‌ల్ సోష‌ల్ మీడియా కంపెనీలు అన్ని రాజ‌కీయ పార్టీల‌కు స‌మ న్యాయం క‌ల్పించ‌డంలేద‌ని విమ‌ర్శించారు. రూల్స్‌ను బ్రేక్ చేసి మ‌రీ మ‌త విద్వేషాల‌ను ఫేస్‌బుక్ రెచ్చ‌గొడుతున్న‌ట్లు సోనియా ఆరోపించారు. ఫేస్‌బుక్ చేప‌డుతున్న అరాచ‌క రాజ‌కీయాల‌కు చ‌ర‌మ గీతం పాడాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

Crude Oil: భారత్‌కు భారీగా రష్యా క్రూడ్ ఆయిల్.. భగ్గుమన్న అమెరికా.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి సమర్థనా?


సోష‌ల్ మీడియా సంస్థ‌లు ప్ర‌జాస్వామ్యాన్ని హ్యాక్ చేస్తున్నాయ‌ని సోనియా గాంధీ అన్నారు. రాజ‌కీయా ప్ర‌యోజ‌నాల కోసం ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ ప‌నిచేస్తున్నాయ‌న్నారు. ఫేస్‌బుక్ కథనాలు అన్నీ అధికార పార్టీలకు ఉపయోగపడుతున్నవైనాలు వెల్లడవుతున్నాయిన ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక గళాలను అణిచివేస్తున్నారని, బీజేపీతో ఫేస్‌బుక్ కుదుర్చుకున్న ఒప్పందం స‌రికాదన్నారు.

CM KCRకు ఉచ్చు బిగిస్తున్నారా? కేంద్రానికి ఫిర్యాదులు.. ఒక్క సింగరేణిలోనే రూ.50వేల కోట్ల స్కామ్.. మోదీతో కోమటిరెడ్డి


కార్పొరేట్ సంస్థ‌లు, ప్ర‌భుత్వం మ‌ధ్య ఒప్పందాలు జరుగుతున్నాయని, వ్య‌వ‌స్థీకృతంగా జ‌రుగుతున్న ఫేస్‌బుక్ జోక్యాన్ని అడ్డుకోవాల‌ని సోనియా గాంధీ అన్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని, సామాజిక స‌మాన‌త్వాన్ని కాపాడుకోవాల‌న్నారు. 'ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన రాజకీయ ఎన్నికల్లో ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియా సంస్థలు క్రమబద్ధమైన జోక్యం, ప్రభావం చేయడం వంటి వాటికి ముగింపు పలకాలని కోరుతున్నా' అని సోనియా గాంధీ అన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Congress, Facebook, Parliament, Social Media, Sonia Gandhi, Twitter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు