తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్... దేశంలోనే తొలిసారి

ఓటరు పోలింగ్ స్టేషన్‌లోకి వచ్చిన తర్వాత అక్కడున్న మొబైల్ ఫోన్‌తో ఓటర్ ఫొటో తీస్తారు. అప్పటికే ఆ మొబైల్ ఫోన్‌కు అనుసంధానమై ఉన్న ఎన్నికల కమిషన్ డేటాలో చెక్ చేస్తారు.

news18-telugu
Updated: January 21, 2020, 10:10 PM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నిషన్ యాప్... దేశంలోనే తొలిసారి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు
  • Share this:
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నషన్ యాప్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం వినియోగించనుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగే 10 ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో దీన్ని పైలెట్ ప్రాజెక్టు కింద వినియోగించనున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోకి కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దీన్ని ఉపయోగించనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటు వేసిన వ్యక్తుల ఫొటోలు అందులో భద్రపరుస్తారు. అయితే, ఇది పైలెట్ ప్రాజెక్ట్ కాబట్టి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ ఫొటోల డేటాను డిలీట్ చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. వాటిని భద్ర పరచడం కానీ, మరే ఇతర కార్యక్రమాల కోసం వాటిని వినియోగించబోమని స్పష్టం చేసింది. ఫొటోలు తీసిన మొబైల్ ఫోన్ నుంచి, అలాగే సర్వర్ నుంచి కూడా ఆ ఫొటోల డేటాను డిలీట్ చేస్తామని హామీ ఇచ్చింది.

ఓటరు పోలింగ్ స్టేషన్‌లోకి వచ్చిన తర్వాత అక్కడున్న మొబైల్ ఫోన్‌తో ఓటర్ ఫొటో తీస్తారు. అప్పటికే ఆ మొబైల్ ఫోన్‌కు అనుసంధానమై ఉన్న ఎన్నికల కమిషన్ డేటాలో చెక్ చేస్తారు. ఆ రెండు ముఖాలు సరిపోల్చుకుంటారు. ఆ ఓటర్ సరైన వ్యక్తి అని నిర్ధారించుకున్న తర్వాత ఓటు వేసేందుకు అంగీకరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లలో జనవరి 22న ఎన్నికలు జరగనున్నాయి. 25న ఎన్నికల ఫలితాలు వస్తాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో జనవరి 25న ఎన్నిక జరుగుతుంది. జనవరి 27న ఫలితాలు వస్తాయి.

First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు