మహిళలకు కేజ్రీవాల్ గుడ్‌న్యూస్...బస్, మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణం

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో.. ఓటర్లను ఆకట్టుకునేందుకే వరాల జల్లు కురిపిస్తోంది. ఈ క్రమంలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తోంది.

news18-telugu
Updated: June 3, 2019, 3:27 PM IST
మహిళలకు కేజ్రీవాల్ గుడ్‌న్యూస్...బస్, మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీ మహిళలకు కేజ్రీవాల్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. మెట్రో రైలు, బస్సు సేవలను మహిళలకు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఐతే ఎప్పటి నుంచి అమల్లోకి తేవాలన్న దానిపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మరో రెండు మూడు నెలల్లోనే అమల్లోకి తెస్తామని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వంపై రూ.1200 కోట్ల భారం పడినా...మహిళల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు కేజ్రీవాల్.

మహిళలకు రక్షణ కల్పించడమే ఆమాద్మీ తొలి ప్రాధాన్యత. మహిళల భద్రతకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఢిల్లీ వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఢిల్లీలో మహిళలందరికీ ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు బస్సులు, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచితంగానే ప్రయాణించవచ్చు.
కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం


ప్రస్తుతం కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు DMRCలో 50 శాతం చొప్పున భాగస్వామ్యం ఉంది. ఢిల్లీ మెట్రోపై పూర్తి అధికారాలు తమకు సంక్రమిస్తే చార్జీలను భారీగా తగ్గిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ సత్తా చూపలేకపోయింది. దేశవ్యాప్తంగా మొత్తం 50 స్థానాల్లో పోటీచేస్తే ఒకే ఒక్క సీటు గెలిచింది. ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో.. ఓటర్లను ఆకట్టుకునేందుకే వరాల జల్లు కురిపిస్తోంది. ఈ క్రమంలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తోంది.
First published: June 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>