Home /News /politics /

Exit Poll Result 2021: బెంగాల్‌ ఈసారి కూడా మమతా ఖాతాలోకేనా.. కేరళలో విజయన్ వైపే మొగ్గు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Exit Poll Result 2021: బెంగాల్‌ ఈసారి కూడా మమతా ఖాతాలోకేనా.. కేరళలో విజయన్ వైపే మొగ్గు.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

మోదీ, మమతా

మోదీ, మమతా

దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్‌ అప్‌డేట్స్ అందిస్తోంది.. న్యూస్18 తెలుగు.

    దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నేడు వెలువడుతున్నాయి. బెంగాల్‌లో తిరిగి తృణమూల్ అధినేత్రి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ కథనాలు వెలువడుతున్నాయి. అస్సాంలో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. టైమ్స్ నౌ - సీ ఓటర్, ఈటీజీ-రీసెర్చ్, P-Marq ఎగ్జిట్ పోల్స్ బెంగాల్‌లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. 150కి పైగా సీట్లు కైవసం చేసుకుంటాయని అంచనా వేశాయి. మరోవైపు CNX-Republic Tv ఎగ్జిట్ పోల్స్‌లో టీఎంసీ 128-132 నుంచి స్థానాలు, బీజేపీ 138-148 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ విజయం సాధిస్తుందని.. 162-185 వరకు స్థానాలను ఖాతాలో వేసుకుంటుందని అంచనా వేసింది.

    తమిళనాడులో డీఎంకే కూటమి క్లీన్ స్విప్ చేస్తుందని P-MARQ, REPUBLIC CNX, టూడేస్ చాణక్య, యాక్సిస్-మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.































































    పశ్చిమ బెంగాల్(294) టీఎంసీ బీజేపీ కాంగ్రెస్-  లెఫ్ట్
    రిపబ్లిక్ సీఎన్ఎక్స్ 128-138 138-148 11-21
    టైమ్స్ నౌ సీఓటర్ 158 115 19
    ఏబీపీ సీఓటర్ 152-164 109-121 14-25
    జన్ కీ బాత్ 104-121 162-185 3-9
    P-MARQ 152-172 112-132 10-15
    ETG RESEARCH 164-176 105-115 10-16
    ఆజ్ తక్- యాక్సిస్ 132-156 134-160 0-3
    ఇండియా న్యూస్-జేకేబీ 104-121 162-185 3-9
    ఇండియా టీవీ-పీపీ  64-88 173-192 7-12



































    తమిళనాడు(234)   డీఎంకే + అన్నాడీఎంకే+ ఇతరులు
    యాక్సిక్- మై ఇండియా 175-195 38-54 1-4
    రిపబ్లిక్ సీఎన్‌క్స్ 160-170 58-68 4-6
     P-MARQ 165-190 40-65 2-9
    టూడేస్-చాణక్య 164-186 46-68 0-6

    కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమి విజయం సాధించనుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. టూడేస్ చాణక్య, యాక్సిస్- మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వందకు పైగా స్థానాల్లో ఎల్డీఎప్ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. సీ ఓటర్, సీఎన్‌ఎక్స్ మాత్రం ఎల్డీఎఫ్‌కు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు మధ్య పోటీ ఉంటుందని.. కానీ ఎల్డీఎఫ్ అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటాయని అంచనా వేశాయి. కేరళలో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందని.. ఎగ్జిట్ పోల్స్ ‌ను చూస్తే అర్థమవుతోంది.






































    కేరళ(140) ఎల్డీఎఫ్ యూడీఎఫ్ బీజేపీ ఇతరులు
    యాక్సిస్ - మై ఇండియా 104-120 20-36 0-2 0-2
    సీ ఓటర్ 71-77 62-68 0-2 --
    సీఎన్‌ఎక్స్ 72-80 58-64 1-5 --
    టూడేస్ చాణక్య 93-111 26-44 0-6 0-3

    అస్సాంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 86 స్థానాల్లో విజయం సాధించింది.. అందులో బీజేపీవి గెలుపొందినవి 60 సీట్లు. అయితే ఈసారి బీజేపీ కూటమి మెజారిటీ తగ్గినప్పటికీ.. అధికారం మాత్రం నిలబెట్టుకుంటుందని మెజారిటీ సర్వేలు అంచనా వేశాయి. మొత్తం 126 సీట్లలో బీజేపీ మెజారిటీ మార్కన్‌ను మించి సీట్లను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

































    అస్సాం బీజేపీ+ కాంగ్రెస్+
    అజ్ తక్- యాక్సిస్ 75-85 40-50
    టూడేస్ చాణక్య 61-79 47-65
    రిపబ్లిక్-సీఎన్‌ఎక్స్ 74-84 40-50
    ఏబీపీ-సీ ఓటర్ 58-71 53-66
    జన్ కీ బాత్ 70-81 45-55

    పుదుచ్చేరిలో ఎన్డీయే..
    30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారం కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రిపబ్లిక్ సీఎన్‌ఎక్స్ ఎన్డీఏ 16-20 స్థానాలు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 11-13 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇక, ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్.. ఎన్డీఏ 19-23, యూపీఏ 6-10, ఇతరులు 1-2 స్థానాలు కైవసం చేసుకుంటాయని అంచనా వేసింది.

    ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఈ ఐదు చోట్ల ఏ పార్టీకి అధికారం దక్కనుందో.. ఒక అంచనాకు రావడానికి వీలు కలుగుతోంది. అయితే పలు సందర్బాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఏ పార్టీకి ఊపుందో తెలిసిపోతుందనే అంచనాతో.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ న్యూస్ 18 తెలుగు మీకు అందజేస్తోంది.

    ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపై ప్రజల్లో చాలా ఆసక్తి నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగగా.. అక్కడ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ, టీఎంసీలు అగ్రనేతల మధ్య విమర్శలు, ఆరోపణలతో అక్కడి ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. బెంగాల్‌లో ఎన్నికల సందర్భంగా కొన్నిచోట్ల హింసాత్మక పరిస్థితులు కూడా చోటుచేసుకున్నాయి. మరోవైపు తమిళనాడులో గెలుపు తమదంటే, తమదని డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఎన్నికల పోలింగ్ మార్చి 27న ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 1న, మూడో దశ ఎన్నికలు ఏప్రిల్ 6, నాలుగో దశ ఎన్నికలు ఏప్రిల్ 10న, ఐదో దశ ఎన్నికలు ఏప్రిల్ 17న, ఆరోదశ ఎన్నికలు ఏప్రిల్ 23న, ఏడో దశ ఎన్నికలు ఏప్రిల్ 26న జరిగాయి. నేడు ఎనిమిదో దశ ఎన్నికలతో.. బెంగాల్‌లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది.

    తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకేదశలో పోలింగ్ జరిగింది. 71.43 శాతం పోలింగ్ నమోదయింది. గెలుపుపై డీఎంకే కూటమి, అన్నాడీఎంకేక కూటమి ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. ఇక 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు.73.58శాతం పోలింగ్ నమోదయింది. కేరళలో 2.74 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న పోలింగ్ జరిగింది. పుదుచ్చేరిలో కూడా ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు నిర్వహించారు. అక్కడ రికార్డు స్థాయిలో 81.64 శాతం పోలింగ్ నమోదయింది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: 5 State Elections, Assam Assembly Elections 2021, Exit polls, Tamil Nadu Assembly Elections 2021, West Bengal Assembly Elections 2021

    తదుపరి వార్తలు